Neeraj Chopra: విరిగిన చెయ్యితోనే ఫైనల్స్ బరిలో నీరజ్ చోప్రా, సెంటీమీటర్ దూరంతో పతకం మిస్, వైరల్ అవుతున్న ఫోటోలు
అయితే.. ఫైనల్లో నీరజ్ విరిగిన చేయితోనే పోటీ పడ్డాడు. నొప్పిని భరిస్తూనే విసిరాడు. కొద్దిలో టైటిల్ కోల్పోయిన భారత బడిసె వీరుడు వచ్చే ఏడాది మరింత బలంతో వస్తానని చెప్పాడు.
New Delhi, SEP 15: బ్రస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా (Neeraj Chopra) రెండో స్థానంతో నిరాశపరిచాడు. ఒక్క సెంటీ మీటర్ తేడాతో (1 CM) టైటిల్ కోల్పోయాడు. అయితే.. ఫైనల్లో నీరజ్ విరిగిన చేయితోనే పోటీ పడ్డాడు. నొప్పిని భరిస్తూనే విసిరాడు. కొద్దిలో టైటిల్ కోల్పోయిన భారత బడిసె వీరుడు వచ్చే ఏడాది మరింత బలంతో వస్తానని చెప్పాడు. అయితే.. తన చేయి విరిగిందనే విషయాన్ని పోటీల అనంతరం నీరజ్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. విరిగిన చేయి ఎక్స్ రే ఫొటోను (Neeraj Chopra Fracture in Left Hand) అతడు పోస్ట్ చేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నీరజ్ మూడో ప్రయత్నంలో బడిసెను 87.86 మీటర్ల దూరం విసిరాడు. జులియన్ వెబర్ 87.97 మీటర్ల దూరంలో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయాడు.
Here's the Neeraj Chopra tweet
‘2024 సీజన్ ముగిసింది. ఈ ఏడాదంతా నేను నేర్చుకున్న విషయాలు, మెరుగైన తీరు, ఎదుర్కొన్న కష్టాలు, మానసికంగా సిద్ధమైన తీరు వీటన్నిటినీ బేరీజు వేసుకుంటా. ఇక సోమవారం.. ప్రాక్టీస్ సమయంలో నాచేతికి గాయమైంది. ఎక్స్ రే తీయగా నా ఎడమ చేతి నాలుగో వేలి దగ్గర ఎముక విరిగింది. అది నాకు ఎంతో సవాల్ విసిరింది. అయినా సరే నా బృందం సహాయంతో బ్రస్సెల్స్‌లో నేను పోటీ పడగలిగాను’ అని నీరజ్ తెలిపాడు. ఎక్స్ ఖాతాలో నీరజ్ పోస్ట్ చూసిన అభిమానులంతా అతడి పట్టుదలకు జై కొడుతూ.. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
పారిస్ ఒలింపిక్స్ ముందు గజ్జల్లోని కండరాల సమస్యతో చోప్రా బాధ పడ్డాడు. దాంతో, అతడి సన్నద్ధత కూడా సరిగ్గా జరగలేదు. అయినా సరే.. చోప్రా విశ్వ క్రీడల్ల అదరగొట్టాడు. ఫైనల్లో 89.45 మీటర్ల దూరం బడిసెను విసిరి సిల్వర్ మెడల్‌తో చరిత్ర సృష్టించాడు. దేశానికి పతకం అందించాలనే తన లక్ష్యం పూర్తి కావడంతో కొన్ని రోజుల బ్రేక్ తీసుకుంటానని నీరజ్ చెప్పాడు. సర్జరీ చేసుకోవాలని అనుకున్న అతడు గాయం తీవ్రత ఎక్కువ లేనందున మళ్లీ ఈటెను అందుకున్నాడు. సర్జరీ వాయిదా వేసుకొని.. లసానే డైమండ్ లీగ్‌లో పోటీ పడిన నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.