Paris Olympics 2024: గతేదాడి జరిగిన అవమానాన్ని పంటికింద బిగపట్టి దేశం కోసం అద్భుత ప్రదర్శన, పారిస్ ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్
గతేడాది దేశ ఆమె అనుభవించిన తన బాధనంతా పంటికింద బిగపట్టి విశ్వక్రీడల్లో అద్భుత ప్రదర్శనతో సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అద్భుత ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గతేడాది దేశ ఆమె అనుభవించిన తన బాధనంతా పంటికింద బిగపట్టి విశ్వక్రీడల్లో అద్భుత ప్రదర్శనతో సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. మంగళవారం మహిళల ఫ్రీస్టయిల్ 50 కిలోల సెమీఫైనల్స్‌లో ఫోగాట్.. 5-0తో యుస్నెలిస్ గుజమన్ (క్యూబా)ను ఓడించి స్వర్ణ పతక రేసులో నిలిచింది.
తద్వారా తాజా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లేదా రజతం అందించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు భారత్‌కు మూడు కాంస్య పతకాలు రాగా అవి షూటింగ్‌లో వచ్చినవే. రెజ్లింగ్ ఫైనల్ చేరడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేశ్ నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్ నుంచి ఈ క్రీడల్లో ఆడుతున్న ఫోగాట్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. బుధవారం జరిగే ఫైనల్‌లో ఆమె యూఎస్‌ఏకు చెందిన హిల్డెబ్రండ్ట్ సారాతో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు పతకాలతో పారిస్ నుంచి భారత్‌లో అడుగుపెట్టిన షూటర్ మను బాకర్, ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వీడియో ఇదిగో..
ఈ క్రీడలో సుశీల్ కుమార్, రవి దహియా తర్వాత ఫైనల్స్‌కు అర్హత సాధించిన మూడో రెజ్లర్ గా వినేశ్ నిలిచారు. సాక్షి మాలిక్ తర్వాత ఒలింపిక్ పతకం గెలువబోతున్న రెండో ప్లేయర్‌గానూ..ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో మహిళల విభాగంలో ఫైనల్ చేరిన తొలి రెజ్లర్ రికార్డు నెలకొల్పారు.