Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్, అధిక బరువు కారణంగా వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు, స్వర్ణ పతక ఆశలు ఆవిరి

స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడిన వార్తలను భారత బృందం పంచుకోవడం విచారకరం

Vinesh Phogat Disqualified From Women’s Wrestling 50kg for Being Overweight

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఊహించని షాక్ తగిలింది. స్వర్ణపతక రేసు ఆశలు రేపిన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువు కారణంగా మహిళల 50 కేజీల రెజ్లింగ్‌కు అనర్హురాలు అయ్యింది. మహిళల రెజ్లింగ్ 50 కిలోల విభాగం నుంచి వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడిన వార్తలను భారత బృందం పంచుకోవడం విచారకరం.  ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్‌కు భారీ షాక్, అధిక బరువు కారణంగా పోటీకి అనర్హురాలుగా ప్రకటించిన అధికారుల, యావత్ భారతీయుల ఆశలు ఆవిరి

రాత్రంతా బృందం ఎంత ప్రయత్నించినప్పటికీ, ఆమె ఈ ఉదయం 50 కిలోల కంటే ఎక్కువ కొన్ని గ్రాముల బరువుతో ఉంది. ఈ సమయంలో భారత బృందం ద్వారా తదుపరి వ్యాఖ్యలు చేయరు. వినేష్ గోప్యతను గౌరవించాలని భారత జట్టు మిమ్మల్ని అభ్యర్థిస్తోంది. ఇది చేతిలో ఉన్న పోటీలపై దృష్టి పెట్టాలనుకుంటోందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది.ఈ విషయాన్ని ANI తెలిపింది.