Ambati Rambabu Slams Nara Lokesh: వీడియో ఇదిగో, మీ తండ్రి లేకపోతే నువ్వో పెద్ద సుద్ద పప్పువి, నారా లోకేష్ మీద విరుచుకుపడిన అంబటి రాంబాబు
Vjy, Jan 28: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను అని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆర్థి క వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఏ హామీనీ అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విష ప్రచారం చేశారని, ఆ తర్వాత వారు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులు రూ.6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు.
రాష్ట్రాన్ని పెట్టుబడుల వరద ముంచెత్తుతుందంటూ కుమారుడు, అధికారులతో కలిసి ఆర్భాటంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు ఉత్త చేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. సీఎంగా వైఎస్ జగన్ దావోస్‌కు వెళ్లి రూ.1.26 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు.
టెక్ మహేంద్ర రూ.200 కోట్ల ప్లాంట్, అదానీ గ్రూప్ రూ.60 వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, కర్నూలు జిల్లాలో రూ.37వేల కోట్లతో గ్రీన్ కో కంపెనీ ప్రాజెక్టు, అరబిందో గ్రీన్ ఎనర్జీ రూ.28వేల కోట్ల ప్రాజెక్టు వంటివన్నీ వైఎస్ జగన్ తెచ్చినవేనని తెలిపారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కోడిగుడ్డాయన అంటున్న లోకేశ్ పెద్ద పప్పుసుద్ద కాదా అని అన్నారు.
Ambati Rambabu Slams Nara Lokesh
లోకేశ్ ఎర్ర బుక్కుకు తన కుక్క కూడా భయపడదని, అక్రమ కేసులతో ఎంతమందిని జైలుకు పంపినా వైఎస్సార్‌సీపీ వెనుకంజ వేయదని స్పష్టం చేశారు.