31 People Fell Sick in Anantapur: అనంతపురం జిల్లాలో విషాదం, కలుషిత నీరు తాగి 31 మందికి వాంతులు, విరేచనాలు, ఒకరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో కలుషిత నీరు తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 31 మంది వాంతులు, విరేచనాలు తదితర కారణాలతో ఆస్పత్రిలో చేరారు.

Water Tank (Photo-Wikimedia Commons)

Gummagatta, May 11: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో కలుషిత నీరు తాగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 31 మంది వాంతులు, విరేచనాలు తదితర కారణాలతో ఆస్పత్రిలో చేరారు. వారిలో కరియమ్మ (75) అనే వృద్ధురాలు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చాకిరి చేయలేక అత్తను దోసె పెంకతో కొట్టి చంపిన కోడలు, సీసీ కెమెరాలో దాడి దృశ్యాలను చూసి షాకయిన మృతురాలి కొడుకు, పోలీసులకు ఫిర్యాదు

అయితే కేసులు పెరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు గ్రామాన్ని సందర్శించిన గ్రామీణ నీటి సరఫరా, వైద్య శాఖ అధికారులు తాగునీటిలో ఎటువంటి సమస్య లేదని తేల్చి చెబుతున్నారు. అయితే గంటగంటకు కేసులు పెరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని బీసీ కాలనీ కింది వీధిలో సుమారు 100 కుటుంబాలు నివాసముంటున్నాయి.

పెద్దపల్లి జిల్లాలో దారుణం, కన్నకూతుర్ని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన తండ్రి, అంతకు ముందు భార్యను చంపిన కేసులో జైలుకు..

ఈప్రాంతానికి తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో కుళాయిల చుట్టూ రెండు మూడు అడుగుల మేర గుంతలు తవ్వుకున్నారు. ఆదివారం రాత్రి, సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి వరద నీరు కుళాయిల్లో ఇంకిపోయింది. సోమవారం యథావిధిగా తాగునీటిని సరఫరా చేశారు. ఈ విషయాన్ని గమనించకుండా ఆ నీటిని తాగడంతోనే గ్రామస్థులకు వాంతులు, విరేచనాలవుతున్నట్లు తెలుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement