Telangana Horror: పెద్దపల్లి జిల్లాలో దారుణం, కన్నకూతుర్ని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన తండ్రి, అంతకు ముందు భార్యను చంపిన కేసులో జైలుకు..

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బట్టుపల్లిలో దారుణ ఘటన జరిగింది. మానసిక పరిస్థితి సరిగా లేక 11 ఏళ్ల కూతర్ని కన్నతండ్రే కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత అదే గొడ్డలితో మరో దుకాణదారుడిపై దాడికి తెగబడ్డాడు.

Telangana Horror: పెద్దపల్లి జిల్లాలో దారుణం, కన్నకూతుర్ని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన తండ్రి, అంతకు ముందు భార్యను చంపిన కేసులో జైలుకు..
Representative Image (File Image)

Peddapalli, May 11: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బట్టుపల్లిలో దారుణ ఘటన జరిగింది. మానసిక పరిస్థితి సరిగా లేక 11 ఏళ్ల కూతర్ని కన్నతండ్రే కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత అదే గొడ్డలితో మరో దుకాణదారుడిపై దాడికి తెగబడ్డాడు. నిందితుడి పేరు గుండ్ల సదానందం కాగా.. ఇతని చేతిలో చనిపోయిన కూతురి పేరు రజిత. మంథని పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

చాకిరి చేయలేక అత్తను దోసె పెంకతో కొట్టి చంపిన కోడలు, సీసీ కెమెరాలో దాడి దృశ్యాలను చూసి షాకయిన మృతురాలి కొడుకు, పోలీసులకు ఫిర్యాదు

సదానందం గతంలో తన భార్యను ఉరి వేసి చంపిన కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. ఇప్పుడు కూతుర్ని కూడా చంపి మరో వ్యక్తిపై హత్యాహత్నానికి పాల్పడ్డాడు. దీంతో గ్రామస్థుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తవమయ్యాయి. సందనందంను పోలీస్‌ స్టేషన్‌నుకు తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. నిందితుడ్ని తామే శిక్షిస్తామని పోలీసు వాహనానికి కంప అడ్డువేశారు. నిందితుడ్ని తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తోపులాట కూడా జరిగి గ్రామస్థుల ఆగ్రహంతో పోలీస్ వాహనంపై దాడి చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

(The above story first appeared on LatestLY on May 11, 2023 04:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).