Representational Image | (Photo Credits: IANS)

ఒడిశా నవంబర్24:   ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని కబి పోలీస్ స్టేషన్ పరిదిలో  దారుణమైన ఘటన చోటు చేసుకుంది.  ఓ భర్త.. తన భార్య, బిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. ఇంట్లోనే ఓ గదిలో వాళ్లు  నిద్రిస్తున్న సమయంలో విషపూరితైన పామును వాళ్ల మీదకు వదిలేసి వారిపై చంపాలని చూశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అధీగావ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల గణేష్ పాత్రా కు బసంతి పాత్రా(23)ను  2020 లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులిద్దరికి రెండున్నరేళ్ల కుమార్తె దేబాస్మిత ఉంది. గత కొంత కాలం నుంచి గణేష్ తన భార్య బసంతి తో తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలోనే  ఆమెను చంపాలని పథకం రచించాడు.

అందుకోసం ఎవరికీ అనుమానం రాకుండా హత్యకు ఓ విషపూరితమైన పామును వాడుకున్నాడు. పాములు పట్టే వ్యక్తి నుంచి ఆ విషపూరితమైన పామును అక్టోబర్ 6 న ఇంటికి తీసుకువచ్చి ఓ ప్లాస్టిక్ డబ్బాలో ఉంచాడు. ఆ తర్వాత రాత్రి సమయంలో నిద్రిస్తున్న భార్య, కుమార్తె గదిలోకి పామును వదిలేసాడు.అతడు వేరే గదిలోకి వెళ్లి నిద్రపోయాడు.

బీహార్‌లో దారుణం, తాగిన మత్తులో కారులోకి బాలికను లాగి అత్యాచారం చేయబోయిన పోలీస్ అధికారి, బాలిక సహాయం కోసం అరవడంతో..

మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి ఆ తల్లి, కూతురు విషం కక్కుకొని చనిపోయి ఉన్నారు. అయితే వీరి మృతిపై అనుమానం వచ్చి బసంతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో ఘటన జరిగిన నెలన్నర తర్వాత కేసులో అసలు నిజం బయటకు వచ్చింది. కేసు విచారణంలో భాగంగా గణేష్ ను పోలీసులు గట్టిగా నిలదీయడంతో నిజాన్ని ఒప్పుకున్నాడు.

ముందు  ఆరోపణలపై ఖండించినప్పటికీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో నిందితుడు అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. వారి గదిలోకి నేనే పామును వదిలినట్టు అంగీకరించాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.