Representational Image | (Photo Credits: IANS)

New Delhi, May 11: దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో 48 ఏళ్ల మహిళ తన అత్తగారిని దోశ పెంక‌తో కొట్టి చంపింది, 86 ఏళ్ల వృద్ధురాలిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిందితురాలు విసుగు చెంది ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ వృద్ధురాలు కీళ్లనొప్పులతో బాధపడుతోందని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘ‌ట‌న ఢిల్లీలోని నెబ్ స‌రాయి ఏరియాలో ఏప్రిల్ 28న చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

దారుణ ఘటన వివ‌రాల్లోకి వెళ్తే.. కోల్‌క‌తాకు చెందిన సుర్జీత్ సామ్(51), ష‌ర్మిష్ఠ సామ్(48), అనే దంప‌తులు త‌మ కూతురు(16)తో క‌లిసి ఢిల్లీలోని నెబ్ స‌రాయి ఏరియాలో 2014 నుంచి నివాస‌ముంటున్నారు. అయితే సుర్జీత్ త‌ల్లి(86) కోల్‌క‌తాలోనే ఉంటుంది. త‌ల్లి తీవ్ర అనారోగ్యానికి గురికావ‌డంతో.. 2022లో ఢిల్లీకి తీసుకొచ్చి, త‌న ఇంటి ముందే ఓ కిరాయి గ‌దిలో త‌ల్లిని ఉంచాడు.

మత్తులో మృగంలా మారి చిన్న పిల్లల మృతదేహాలపై అత్యాచారం, 30 మంది చిన్నారులను చంపి కామవాంఛ తీర్చుకున్న కామాంధుడు, దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు

అయితే కీళ్లనొప్పులతో బాధ‌ప‌డుతున్న అత్త‌కు కోడ‌లు సేవ‌లు చేయ‌డంలో ఇబ్బంది ప‌డుతోంది. దీంతో ఏప్రిల్ 28వ తేదీన ఉద‌యం 10:30 గంట‌ల‌కు అత్త ఉంటున్న గ‌దిలోకి వెళ్లి దోశ పెంక‌తో దాడి చేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాల‌య్యాయి. తీవ్రంగా ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌డంతో ఇంట్లోనే కుప్ప‌కూలిపోయింది వృద్ధురాలు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, హాసి సోమ్ ముఖం, పుర్రెపై అనేక గాయాలతో వంటగదిలో పడి ఉందని పోలీసులు తెలిపారు. ఎయిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వ‌హించ‌గా, ఆమె శ‌రీరంపై 14 గాయాలు ఉన్న‌ట్లు తేల్చారు. దీంతో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా, కోడ‌లు ష‌ర్మిష్ట‌నే దోశ పెంక‌తో కొట్టి చంపిన‌ట్లు తేలింది.

యవ్వనదశలో యువతీయువకులు ప్రేమలో పడటాన్ని కోర్టులు నియంత్రించలేవు, తీర్పు విషయంలో న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ఢిల్లీ హైకోర్టు

బెడ్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరా కనిపించినా అందులో స్టోరేజీ పరికరం లేదు. అయినప్పటికీ, దానిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.సుర్జిత్ తన తల్లి దినచర్యను పర్యవేక్షిస్తున్నందున తన ఫోన్‌లోని కెమెరా నుండి ప్రత్యక్ష ఫీడ్ ఉందని చెప్పాడు. అలాగే ఘటన జరిగిన రోజు కరెంటు కోత వల్ల కెమెరా పనిచేయలేదని పోలీసులకు తెలిపాడు.