Andhra Pradesh Assembly Polls 2024: 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. నేను చేసినదాంట్లో 10 శాతమైనా చేశానని చెప్పగలడా..? మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ ధ్వజం..

మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం అని, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే, పేదల పక్షాన మీ బిడ్డ జగన్‌ ఉన్నాడని తెలిపారు.

YS jagan memantha-siddham-(photo-X/YSRCP)

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం అని, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉంటే, పేదల పక్షాన మీ బిడ్డ జగన్‌ ఉన్నాడని తెలిపారు.

‘‘అందరి ప్రయోజనాలు రక్షించుకునేందుకు, మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?. ఈ యుద్ధంలో నేను ఎప్పుడూ పేదల పక్షమే. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా?. మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. పేదల భవిష్యత్‌ను నిర్ణయించేది ఈ ఎన్నికలే. మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది. జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?’’ అంటూ ప్రజలను ఉద్దేశించి అన్నారు.

‘‘చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తుకురాదు. బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటి లేదు. మ్యానిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, దైర్యం చంద్రబాబుకు ఉందా?. 30 ఏళ్ల క్రితమే సీఎంగా చేసిన చంద్రబాబు.. నా గతాన్ని చూసి ఓటేయండి అని అడగలేరు. మ్యానిఫెస్టోలోని 10 శాతం హామీలైనా అమలు చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?’’ అంటూ సీఎం జగన్‌ ప్రశ్నించారు.



సంబంధిత వార్తలు