AP Cabinet Dissolved: మంత్రిగా తనకు అవకాశాలు తక్కువని తెలిపిన కొడాలి నాని, అయిదారుగురు మంత్రులు కేబినెట్‌లో కొనసాగే అవకాశం, ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి

ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న (Andhra Pradesh Cabinet dissolved) నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా (all ministers submit resignation letters)చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.

Kodali Nani (Photo-Video Grab)

Amaravati, April 7: మరో రెండు సంవత్సరాల్లో రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది.ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న (Andhra Pradesh Cabinet dissolved) నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా (all ministers submit resignation letters)చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన క్యాబినెట్‌ సమావేశంలో ఏపీ మంత్రులంతా పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) స్పష్టం చేశారు. సీఎం నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీ కేబినెట్‌ బేటీ ముగిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒక అశయం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారని కొడాలి నాని ప్రశంసించారు. సీఎం సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు సంతృప్తి ఉందన్నారు. ఇకపై శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతం అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.

ఏపీలో మూకుమ్మడిగా 24 మంది మంత్రుల రాజీనామా, ఏపీ సీఎం నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపిన కొడాలి నాని, ఏప్రిల్‌ 11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం

కాగా సామాజిక సమీకరణాల కారణంగా పాత మంత్రుల్లో అయిదారుగురు కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉందని అన్నారు. అనుభవం రీత్యా కొంతమందిని కొనసాగిస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారని పేర్కొన్నారు. కొత్త కాబినేట్‌లో మీరు కొనసాగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా..తనకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు కొడాలి నాని తెలిపారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లిపోవచ్చని తెలిపిన జగన్ సర్కారు

మంత్రులంతా రెండున్నరేళ్ల వరకే కొనసాగుతారని ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan Mohan Reddy) ప్రకటించినందున ఆ గడువు గత డిసెంబర్‌లో ముగిసింది. దీంతో మంత్రివర్గంలో మార్పుచేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు ఆళ్లనాని, ధర్మాన కృష్ణదాస్‌, పాముల పుష్ప శ్రీవాణి, కే నారాయణ స్వామి, అంజద్‌ బాషా, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర్‌ నారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, తానేటి వనిత, రంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్‌రావు, కన్నబాబు, పిన్నపి విశ్వరూప్‌, గమ్మనూర్‌ జయరాం, గోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement