AP Cabinet Key Decisions: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌, క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

CM Jagan Mohan Reddy (Photo/AP CMO)

Vjy, Jan 31: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రి వర్గ సమావేశం (Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

దీంతో పాటుగా రెండేళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్‌ విధానానికి అంగీకరించింది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే డిస్కంలకు రూ.1500 కోట్ల రుణం తీసుకునేందుకు బ్యాంకు హామీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఏపీలో ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం, 5,300 మందికి ఉద్యోగాలు..

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పొందిన సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీ సహా ఏపీ పబ్లిక్‌ సర్వీసులు నియామక, నియంత్రణ చట్ట సవరణను ఆమోదించింది. అలాగే వైఎస్సార్‌ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.

ఎస్‌ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా ఇంధన రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రాతిపాదనలకు ఆమోదం లభించినట్లయింది. ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది క్యాబినెట్. ఎస్‌ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్‌ ఆమోదంతో పాటు యూనివర్శిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలపగా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు, ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్‌ పోస్టు ఏర్పాటు, ఆ మేరకు చట్టంలో సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

న్యాయవాదుల సంక్షేమ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదంతో పాటు అసైన్డ్‌ భూముల మార్పిడి నిషేధ చట్ట సవరణ బిల్లుకు అంగీకారం తెలిపింది. ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెజిస్లేచర్‌ స్టడీస్‌ అండ్‌ ట్రైనింగ్‌ సంస్థ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కుటుంబ భద్రతకు ఏర్పాటు చేసే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో 25 మంది హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అంగీకారం తెలిపింది.డిజిటల్ ఇన్‌ఫ్రా కంపెనీని రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement