SIPB Approves Huge Investment in AP: ఏపీలో ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం, 5,300 మందికి ఉద్యోగాలు..
SIPB Approves Huge Investment in AP (Photo-APCMO/X)

Vjy, Jan 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (State Investment Promotion Board) ఆమోదం తెలిపింది. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయం (SIPB Approves Huge Investment in AP) తీసుకుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం (SIPB Approves huge investment in Andhra Pradesh) లభించింది. ఈ భారీ పెట్టుబడులతో ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులతో పాటుగా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

ఇక జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ దాదాపు రూ. 12,065 కోట్ల పెట్టుబడితో 3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది. వైయస్సార్‌ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్‌ 850 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కుతాయని అంచనా. ఫిబ్రవరి 1 నుంచి సామాన్యులకు ఊరట, లబ్ధిదారుని వివరాలతో పని లేకుండా రూ. 5 లక్షల వరకు నగదు బదిలీ, IMPS కొత్త రూల్ గురించి తెలుసుకోండి

మరో కంపెనీ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలిమండలం జలదుర్గం వద్ద రెండు విండ్‌పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.సుమారు 171.60 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటుతో రూ.1287 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా..

Here's AP CMO Tweet

ఆగ్వాగ్రీన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే మరో కంపెనీ శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందు కోసం రూ.4వేల కోట్లు ఖర్చు చేయనుండగా ప్రత్యక్షంగా 1000 మంది​కి ఉద్యోగావకాశాలు రానున్నాయి.

ఇక కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ 200 మెగావాట్ల విండ్‌పవర్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.1350 కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టు ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. అనంతపురం ఉమ్మడి జిల్లాలో రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్‌ లిమిటెడ్‌ 600 మెగావాట్ల విండ్‌పవర్‌ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది . ఇందుకోసం రూ.3,600 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 600 మంది ఉద్యోగాలు దొరకున్నాయి.