ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో నోటిఫికేషన్ జారీ అయ్యింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయన్నుట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.సూపర్ స్పెషాలిటీలో 169, బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశాం. వీటిలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 6న ఓల్డ్ జీజీహెచ్ , హనుమాన్ పేట , విజయవాడ డీఎంఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్ ఇన్ రిక్రూట్మెంట్ జరగనుందని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి సామాన్యులకు ఊరట, లబ్ధిదారుని వివరాలతో పని లేకుండా రూ. 5 లక్షల వరకు నగదు బదిలీ, IMPS కొత్త రూల్ గురించి తెలుసుకోండి
అలాగే.. బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఫిబ్రవరి 1 నుండి 15వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎం.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు పూర్తి వివరాల కోసం https://dme.ap.nic.in లేదంటే.. http://apmsrb.ap.gov.in/msrb వెబ్సైట్లను పరిశీలించాలని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.