AP Assembly Session 2022: అసెంబ్లీ సమావేశాలను విజయవంతం చేయండి, అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరిన స్పీకర్

శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు.

File Image of Andhra Pradesh Assembly | ANI Photo

అమరావతి, సెప్టెంబరు 14 : ఈ నెల 15 వ తేదీ నుండి జరుగనున్న ఆంద్రప్రదేశ్ శాసన మండలి మరియు శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు. గత సమావేశాల్లో మరియు ప్రస్తుతం సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సకాలంలో అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను వారు కోరారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు వారు సూచించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్ లో పలు శాఖల కార్యదర్శులు మరియు పోలీస్ అధికారులతో వేరు వేరుగా జరిగిన సమావేశాల్లో వారిరువురూ పాల్గొని సభ్యుల ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేయడం మరియు పోలీస్ బందో బస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ గౌరవ శాసన మండలి సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సి భాద్యత అధికారులపై ఉందన్నారు. అటు వంటి సత్సాంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన కోరారు. గత సమావేశాల్లో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో కొన్నింటికి ఇంకా సమాధానాలు అందజేయాల్సి ఉందని, ఆ సమాదానాలను కూడా ఈ సమావేశాల్లో అందజేయాలని అధికారులను ఆయన కోరారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఈఎంఐ పద్ధతిలో ఈ–స్కూటర్లను అందించనున్న జగన్ సర్కారు

మాజీ ఎం.ఎల్.సి.ల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడే మాజీ ఎం.ఎల్.సి.లకు అందజేసే ఔషధాలను వారు నివశించే ప్రాంతాల్లోనే అందజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆయన సూచించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసేందుకు ప్రతి శాఖ ఒక లైజనింగ్ అధికారిని నియమించాలని ఆయన సూచించారు.

అనంతరం పోలీస్ అధికారులతో శాంతి, భద్రతల అంశాన్ని సమీక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డిని ఆయన కోరారు. గౌరవ సభ్యులు బస చేసే ప్రాంతాలు మొదలు సమావేశాలకు వారు హాజరు అయ్యేంత వరకూ పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, వారి రాకపోకలకు ఎటు వంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ ప్రజల యావత్ దృష్టి ఈ నెల 15 నుండి జరుగబోవు శాసన సభా సమావేశాలపై ఉంటుందని, వాటికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు. ఈ నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం అందజేయాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు. సభ్యుల గౌరవాన్ని కాపాడటంలోనే మన గౌరవం ముడిపడిఉందనే అంశాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. గత సమావేశాల్లో గౌరవ శాసన సభ్యులు అడిగిన ప్రశ్నల్లో పలు ప్రశ్నలకు ఇంకా సమాధానాలను అందజేయాల్సి ఉందని, వాటన్నింటినీ గురువారం నుండి జరుగబోవు సమావేశాలు ముగిసే లోపు తప్పక అందజేయాలని అన్నిశాఖల కార్యదర్శలను ఆయన కోరారు. మాజీ శాసన సభ్యులకు ప్రభుత్వ పరంగా అందజేసే వైద్య సేవలను మరింత మెరుగు పర్చాలని, వారికి చెల్లించాల్సిన వైద్య బిల్లులను సకాలంలో చెల్లించాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన కోరారు.

అనంతరం పోలీస్ అధికారులతో శాంతి, భద్రతల అంశంపై ఆయన చర్చిస్తూ ఈ సమావేశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. అటు వంటి పరిస్థితుల్లో ఎంతో పటిష్టమైన పోలీస్ బందో బస్తు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డిని ఆయన కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ గ్యాప్లు అయితే ఉన్నాయో వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందో బస్తుతో పాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటు వంటి ఏమరపాటులేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బందో బస్తు విధులను నిర్వహించాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, చీఫ్ కో-ఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డి, శాసన సభ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులు, శాసన మండలి ఓ.ఎస్.డి. కె.సత్యనారాయణరావు తదితరులతో పాటు పలు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్

Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ

Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

Share Now