Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో దారుణం, భార్య ఉరేసుకుంటుంటే భర్త ఆపకుండా సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు, ఆ వీడియోని బంధువులకు పంపించి పైశాచికానందం పొందాడు

ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు (married woman committed suicide) పాల్పడింది. ఇంకా దారుణం ఏంటంటే భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సిన భర్త, కళ్ల ముందే ఆమె ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా తాపీగా సెల్‌ఫోన్‌లో వీడియో ( Video in Cellphone) తీశాడు.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Nellore, Sep 22: ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు (married woman committed suicide) పాల్పడింది. ఇంకా దారుణం ఏంటంటే భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సిన భర్త, కళ్ల ముందే ఆమె ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా తాపీగా సెల్‌ఫోన్‌లో వీడియో ( Video in Cellphone) తీశాడు.

అంతటితో ఆగకుండా ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాలను ఆమె బంధువులకు పంపించాడు. మృతురాలు ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్‌ పర్సన్‌గా పనిచేస్తున్న కొండమ్మగా గుర్తించారు. పైశాచిక భర్త పెంచలయ్యపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మెప్మా సిబ్బంది ఆందోళనకు దిగారు.

అదే జిల్లాలో బుచ్చిరెడ్డి పాలెంలో పొలాన్ని కౌలుకు ఇచ్చిన రైతు మోడెం చంద్రశేఖర్‌రెడ్డి (56)ని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన 13 ఎకరాల పొలాన్ని కోవూరు మండలం పాటూరు గ్రామానికి చెందిన సురేష్‌ అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో పంటను కోయాలని సురేష్‌ అనుకున్నాడు.

రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్త, తట్టుకోలేక మర్మాంగాలు కోసి హత్య చేసిన భార్య, వరంగల్ జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు

ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎకరానికి 13 వేల రూపాయలను కౌలుగా చెల్లించాల్సి ఉంది. కానీ చంద్రశేఖర్‌రెడ్డి తనకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని గత పది రోజుల కిత్రం డిమాండ్‌ చేశాడు. దీనికి కౌలు రైతు సురేష్‌ ఒప్పుకోలేదు. అయితే, పంట తాను కోసుకుని ధాన్యాన్ని విక్రయించి మిగిలిన డబ్బులు ఇస్తానని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపాడు. దీనికి సురేష్‌ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈనెల 14న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి కనిపించకపోవడంతో అతని భార్య వసుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు చంద్రశేఖర్‌రెడ్డి మొబైల్‌ ఆధారంగా సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో తాము దొరికిపోయామని గ్రహించి సురేష్‌ పోలీసులకు లొంగిపోయి జరిగిన విషయాన్ని తెలిపాడు. నిందితుడు ఈనెల 14న చంద్రశేఖర్‌ను రేబాలలోని నిర్మానుష్యమైన ప్రాంతానికి రమ్మని చెప్పి అక్కడ అతని చేత పూటుగా మద్యం తాగించాడు.

ప్రేమికులను దారుణంగా హింసించిన గ్రామస్థులు, మెడలో స్కూటర్‌ టైర్‌ వేసి డ్యాన్స్‌ చేయాలని ఒత్తిడి, ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

తర్వాత చంద్రశేఖర్‌రెడ్డిని కొట్టి తాడుతో మెడకు ఉరివేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా వెంకటేశ్వరపురం వద్ద ఉన్న పెన్నానదిలో పూడ్చి వేశాడు. ఈ మేరకు నిందితుడిని తీసుకెళ్లి పూడ్చిన స్థలానికి చేరుకుని చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈ హత్యలో మొత్తం 6 మంది పాల్గొన్నారని, మిగిలిన 5 మందిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement