Warangal Shocker: రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్త, తట్టుకోలేక మర్మాంగాలు కోసి హత్య చేసిన భార్య, వరంగల్ జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు
తెలంగాణ వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రతి రోజూ తాగొచ్చి భర్త వేధిస్తున్నాడని ఓ భార్య నిద్ర పోతున్న భర్తను దారుణంగా హత్య (Woman kills alcoholic husband) చేసింది. ఈ అమానుష ఘటన వరంగల్ జిల్లా (Warangal), మరిపెడ మండలంలో జరిగింది.
Warangal, Sep 22: తెలంగాణ వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రతి రోజూ తాగొచ్చి భర్త వేధిస్తున్నాడని ఓ భార్య నిద్ర పోతున్న భర్తను దారుణంగా హత్య (Woman kills alcoholic husband) చేసింది. ఈ అమానుష ఘటన వరంగల్ జిల్లా (Warangal), మరిపెడ మండలంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తానంచెర్ల గ్రామపంచాయతీ పరిధిలో వాంకుడోతు తండాకు చెందిన భర్త భూక్యా బీచ్యా మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగారావడమే కాకుండా కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు.భర్త అరాచకాలతో విసిగిపోయిన భార్య భర్తను హత్య చేయాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి నిద్రపోయిన తర్వాత భర్త మర్మాంగాలను కోసి హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా తన తల్లి హత్య కేసులో భూక్యా బీచ్యా ప్రధాన నిందితుడు. కొద్ది రోజుల క్రితమే శిక్ష అనుభవించి.. జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసై భార్యను నిత్యం వేధిస్తుండేవాడు. భర్త వేధింపులు తాళలేక ఆమె ఈ ఘటనకు పాల్పడింది.
(The above story first appeared on LatestLY on Sep 22, 2021 04:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

