Andhra Pradesh: పాస్టర్ కాదు కామాంధుడు, చర్చికి వచ్చిన బాలికను లోబరుచుకుని పదే పదే అత్యాచారం, గర్భవతిని చేసి పుట్టిన బిడ్డను మాయం చేసిన నీచుడు

ప్రార్థనలు చేస్తూ అందరికీ సాంత్వన చేకూర్చాల్సిన పాస్టర్ దారి తప్పాడు. అభం శుభం తెలియని తల్లి లేని బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. బాలికను తల్లిని చేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో ఈ ఘటన చోటుచేసుకుంది.

Representative image (Photo Credit- Pixabay)

Pastor Rapes Minor Girl: ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోరం జరిగింది. ప్రార్థనలు చేస్తూ అందరికీ సాంత్వన చేకూర్చాల్సిన పాస్టర్ దారి తప్పాడు. అభం శుభం తెలియని తల్లి లేని బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. బాలికను తల్లిని చేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో ఈ ఘటన చోటుచేసుకుంది.

17 ఏళ్ల తల్లి లేని బాలిక పాస్టర్ బెజవాడ హోసన్న నిర్వహించే చర్చిలో సభ్యురాలిగా ఉంది. ఆ అమ్మాయిని లోబరుచుకున్న పాస్టర్ ఆమెను గర్భవతిని చేశాడు. ఆమెకు పుట్టిన బిడ్డను మాయం చేశాడు. గత నెల 5న బాధితురాలు మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన నేరం బయటపడకుండా ఉండేందుకు బిడ్డను ఆయన మాయం చేశాడు.

నల్గొండ జిల్లాలో యువతి తరపు బంధువులు దారుణం, పెళ్లి విషయం మాట్లాడుదామని పిలిచి యువకుడిని కత్తులతో నరికి చంపేశారు

నెల రోజులు గడుస్తున్నా బిడ్డ ఆచూకీ దొరక్క పోవడంతో... బిడ్డను అమ్మేయడమో, చంపేయడమో చేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. పుట్టిన బిడ్డ ఏమయ్యాడో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనంగా మారింది.