MLC Pothula Sunitha Quits YSRCP:వైసీపీకి మరో నేత గుడ్‌బై, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా, పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలగుతున్న కీలక నేతలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. గతంలో ఆమె టీడీపీలో పని చేశారు. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇండిపెంటెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై ఓడిపోయారు.

MLC Pothula Sunitha Quits YSRCP

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. గతంలో ఆమె టీడీపీలో పని చేశారు. 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇండిపెంటెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై ఓడిపోయారు. అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పోతుల సునీతకు పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవం ఇచ్చారు.

అయితే 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కరణం బలరాం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో ఎమ్మెల్యే కరణం బలరాంతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరారు. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు.  వైసీపీలో పెను మార్పులు,దువ్వాడకు షాకిచ్చిన జగన్, టెక్కలి ఇంఛార్జీగా పేరాడ తిలక్, కొత్త అనుబంధ సంఘాల అధ్యక్షులు వీరే

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిపాలవడంతో పార్టీ కార్యక్రమాలకు పోతుల సునీత క్రమేపీ దూరంగా ఉంటూవచ్చారు. తాజాగా ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఆమె పంపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంగళవారం ఏలూరు మేయర్ దంపతులతో పాటు కీలక నేతలు రాజీనామా చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement