Vij, Aug 23: ఏపీలో అధికారం కొల్పోవడంతో పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు వైసీపీ అధినేత జగన్. కొత్తగా పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు షాకిచ్చారు జగన్. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీగా పేరడా తిలక్‌ను నియమించారు.
దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో రచ్చకెక్కగా 16వ రోజు శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు వాణి, ఆమె కుమార్తెలు. తనకు ఎలాంటి ఆస్తి వద్దని, దువ్వాడ శ్రీనుతో కలిసి ఉంటామని వారు చెబుతుండగా తనకు వాణి నుండి విడాకులు కావాలని హైకోర్టును ఆశ్రయించారు శ్రీనివాస్. దీనికి తోడు వివాదాస్పద ఇంటిపై వైసీపీ బోర్డు పెట్టడంతో సీరియస్ అయ్యారు జగన్. కుటుంబ వివాదంలోకి పార్టీని లాగడం సరికాదని భావించిన జనగ్... టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను మారుస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. మోదీ గారూ..మీ ప్రవర్తన చాలా సిగ్గుచేటుగా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల
Here's Tweet:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు @ysjagan గారు మరికొందరిని నియమించారు.
1.పార్టీ ప్రధాన కార్యదర్శులు (సమన్వయం)గా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని నియమించారు.…
— YSR Congress Party (@YSRCParty) August 22, 2024
అలాగే పా ర్టీ ప్రధాన కార్యదర్శులు (సమన్వయం)గా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని పార్టీ మరో ప్రధాన కార్యదర్శి (అనుబంధ విభాగాలు)గా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. వైయస్ఆర్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,
బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ను ,ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబును ,విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు. చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవిని ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు అప్పగించారు.