Vjy, August 22: ప్రముఖ వ్యాపారవేత్త అదానీని కాపాడేందుకు మోదీ కుటిల యత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా బ్రిటీష్ వారిపై పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆమె అన్నారు. అలుపెరుగని పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిందని చెప్పారు. మోదీ హయాంలో కార్పొరేట్ శక్తులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నాయని... ప్రజల ఆస్తులను దోచుకుంటున్నాయని విమర్శించారు.
ప్రజలను లూటీ చేస్తున్న జలగలను తరిమికొడతామని చెప్పారు. కార్పొరేట్ల చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ తో మోదీ సర్కార్ నడుస్తోందని అన్నారు. దేశాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ మరో పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుని, ప్రతిపక్షాల మీద కక్షపూరిత దాడులకు పాల్పడే మోదీ నియంత పాలనపై కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా ఏపీలో లేవు, చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్
అదానీ కోసం దేశాన్ని దారుణ పరిస్థితుల్లోకి మోదీ నెట్టేశారని చెప్పారు. అదానీ వ్యాపారాలపై దర్యాప్తును ప్రారంభించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అదానీ విషయంలో మోదీ ప్రవర్తిస్తున్న తీరు సిగ్గుచేటని మండిపడ్డారు.