Red Alert for Andhra Pradesh: ఏపీకి రెడ్ అలర్ట్, మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్న వాయుగుండం, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Vjy, Sep 9: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీంతో రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి ఉత్తర ఒడిస్సాలో పూరి - పశ్చిమ బెంగాల్‌ ప్రాంతంలోని డేగ అల మధ్య వాయుగుండం తీరం దాటనుంది. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. దాంతో, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. పాఠశాలలు, కళాశాలలకు సోమవారం నాడు సెలవు ప్రకటించినట్టు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అల్లూరి జిల్లా కలెక్టర్ కూడా విద్యాసంస్థలకు సెలవుపై స్పందించారు. జిల్లాకు భారీ వర్షసూచన ఉందని తెలిపారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు వాగులు, కాలువలు దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు.

‘బుడమేరు’ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్.. ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారుల హెచ్చరిక

ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఏలేరు ప్రాజెక్టు స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని స్పష్టం చేశారు. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా చూసుకోవాలని సూచించారు. ఆహారం, తాగునీరు, వైద్య శిబిరాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. వాయుగుండం కారణంగా గత రెండు రోజులుగా ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవనున్నాయి.

ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నచ్చచెప్పి పునరావాసా కేంద్రాలకు తరలించాలని చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వరదలు, వర్షాలపై ప్రజలకు అలర్ట్ సందేశాలను ఫోన్ ద్వారా పంపాలని సూచించారు. నాగావళి, వంశధార నదులకు వరద ప్రవాహం పెరిగే అవకాశముందని తెలిపారు. ఇక విశాఖలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్లు 0891-2590102, 0891-2590100 కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.

కోస్తాలో తీరం వెంబడి 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం కాకినాడ రేవుల్లో మూడవ ప్రమాదక హెచ్చరిక జారీ చేయనున్నారు.ఈ నెల12 వరకూ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని అధికారులు సూచించారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.

నిన్నటి నుంచే విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కొండవాలు ప్రాంతాలు, ముంపు గ్రామాల్లో తిరిగి ప్రజలను విశాఖ నగర పోలీస్ కమిషనర్ బాగ్చి అప్రమత్తం చేస్తున్నారు. నగరంలో ముందస్తుగా ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు అంతా అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement