Guntur Shocker: నా కూతుర్నే ప్రేమిస్తావా..యువకుడి కాళ్లు చేతులు నరికేసిన ప్రియురాలి బంధువులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసిన ప్రియుడు, గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో దారుణ ఘటన

తమ కుమార్తెను ప్రేమించాడనే కారణంతో యువతి తరపు బంధువులు యువకుడిపై దారుణానికి (Man murders a young guy) పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది.

Murder (Photo Credits: Pixabay)

Guntur, April 28: తమ కుమార్తెను ప్రేమించాడనే కారణంతో యువతి తరపు బంధువులు యువకుడిపై దారుణానికి (Man murders a young guy) పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో వెంకటేష్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించగా ( love affair with his daughter in Guntur) ఆగ్రహంతో యువతి తరుఫు బంధువులు అతని కాళ్లు చేతులు నరికేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అయితే వారి పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రుకు తెలియడంతో.. వెంకటేశ్‌ను పిలిపించి గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు.

నా సెక్స్ కోరిక తీరుస్తావా లేదా..ఒప్పుకోకపోవడంతో వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన వృద్ధుడు, బాడీని మూడు ముక్కలు చేసి రైలు పట్టాలపై పడేసిన కామాంధుడు, ఖమ్మం జిల్లా కారేపల్లిలో దారుణ ఘటన

అయితే పంచాయతీ జరిగినప్పటి నుంచి వెంకటేశ్‌ గ్రామానికి దూరంగా ఉంటూ.. సదరు యువతితో మాత్రం ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులు కంటపడటంతో వెంకటేశ్‌ను గత రాత్రి గ్రామానికి పిలిపించారు. అతనితో మాట్లాడాలని గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతి తండ్రి భాస్కర్ రావు, మరో ఐదుగురు వ్యక్తులు కలిసి ఆయుధాలతో తీవ్రంగా కొట్టి కాళ్లు, చేతులు నరికేశారు.

భార్యకు కరోనా వచ్చిందని తల నరికి దారుణ హత్య, అనంతరం బిల్డింగ్‌ మీద నుంచి దూకి ఆత్మహత్య, మరో చోట కోవిడ్ సోకిన భర్తను బతికించేకునేందుకు నోటి ద్వారా శ్వాస అందించిన భార్య

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వెంకటేశ్‌ను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంకటేశ్‌పై దాడికి చేసినవారు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement