Andhra Pradesh Shocker: పోలీసులమంటూ పొదల్లోకి తీసుకెళ్లి యువతిపై దారుణంగా అత్యాచారం, నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన మచిలీపట్నం పోలీసులు
పోలీసుల మంటూ ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.పోలీసులమంటూ తనను ఎత్తుకెళ్లిన ఇద్దరు తనపై లైంగికదాడి (raping woman in Andhra Pradesh) చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Machilipatnam, August 16: ఏపీలోని మచిలీపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. పోలీసుల మంటూ ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.పోలీసులమంటూ తనను ఎత్తుకెళ్లిన ఇద్దరు తనపై లైంగికదాడి (raping woman in Andhra Pradesh) చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ప్రకారం.. మచిలీపట్నం పట్టణానికి చెందిన ఓ యువతి ఇటీవల రాత్రి సమయంలో పనిముగించుకొని ఇంటికి వెళ్తున్నది. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు పోలీసులమంటూ అడ్డగించారు. ఎక్కడికెళ్తున్నావ్.. ఏం చేస్తుంటావ్.. అని అడుగుతూ బైక్ ఎక్కాలని బెదిరించారు. అందుకు యువతి నిరాకరించడంతో బలవంతంగా బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లారు.
మచిలీపట్నం (Machilipatnam) చిలకలపూడి రైల్వే స్టేషన్ వెనక ఖాళీ స్థలంలోకి యువతిని తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు రికార్డు చేశారు. ఈ విషయం ఎక్కడైనా చెప్తే వీడియోలు బయటపెడతామంటూ బెదిరించారు. బాధితురాలి బ్యాగులోని ఫోన్ లాక్కుని ఉడాయించారు. అయితే దారుణం జరిగిన మరుసటి రోజు తనపై లైంగికదాడికి పాల్పడిన వారిలో ఒకరు తన ఇంటి ముందు నుంచి వెళ్తుండగా గుర్తించింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వారి సాయంతో ఆ యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. యువతిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడిని సుకర్లాబాద్‌కు చెందిన నారాయణగా పోలీసులు గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
యువతిపై తానొక్కడినే లైంగికదాడికి పాల్పడినట్టూ నిందితుడు పోలీసులకు చెప్పడంతో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తనపై ఇద్దరు లైంగికదాడి చేశారని, రెండో వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని బాధితురాలు పోలీసులను వేడుకుంటున్నది. కాగా నిందితుడి నుంచి యువతి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడి మొబైల్ డాటాతో పాటు ఘటన జరిగిన ప్రాంతంలోని కాల్ డాటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు.