Techie Dies by Suicide: విశాఖలో ప్రేమ విఫలం కావడంతో టెకీ ఉరివేసుకుని ఆత్మహత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పి.రాంప్రసాద్ (30) అనే వ్యక్తి కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందినవాడు. విశాఖలోని శంకరమఠంలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
Vizag, August 17: విశాఖలో ప్రేమ విఫలమయిందనే బాధతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పి.రాంప్రసాద్ (30) అనే వ్యక్తి కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందినవాడు. విశాఖలోని శంకరమఠంలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సీతంపేట ప్రాంతంలోని గణేశ్ నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు.
కూల్ బీర్ కోసం తల పగలకొట్టుకున్న యువకుడు, కాకినాడలో జరిగిన ఫైటింగ్ వీడియో ఇదిగో
అయితే నిన్న ఉదయం తన నివాసంలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన అతని స్నేహితుడు ద్వారకా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించగా వారికి సూసైడ్ నోట్ దొరికింది. ప్రేమ విఫలమయిందనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ధర్మేంద్ర తెలిపారు.