Andhra Pradesh: విశాఖలో ప్రేమోన్మాది మృతి, యువతిపై పెట్రోల్‌తో దాడి చేసి నిప్పంటించి..ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు చికిత్స పొందుతూ మృతి, యువతి పరిస్థితి విషమం

విశాఖపట్నంలోని ఓ లాడ్జీలో యువతిపై పెట్రోల్‌తో దాడిచేసి, ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హర్షవర్ధన్‌ కేజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు.

Representational Image (Photo Credits: ANI)

Visakha, Nov 16: విశాఖపట్నంలోని ఓ లాడ్జీలో యువతిపై పెట్రోల్‌తో దాడిచేసి, ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హర్షవర్ధన్‌ కేజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు. వరంగల్‌కు చెందిన హర్షవర్ధన్ వైజాగ్ (Visakhapatnam) లాడ్జిలో యువతిపై పెట్రోల్‌తో దాడి చేసి ( Young man who set himself on fire) నిప్పంటించాడు.

ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.తన ఒంటిపై కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాధితులిద్దరిని కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్‌ రెడ్డి, విశాఖకు చెందిన సదరు యువతి పంజాబ్‌లో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ఈ క్రమంలో యువకుడు ఈనెల 13న యువతిని లాడ్జికి రమ్మన్నాడు.

సాటి స్త్రీ పై ఇంత అమానుషమా..మహిళా ఖైదీ దుస్తులు విప్పించి, ఇతరుల ముందు నగ్నంగా డ్యాన్స్ వేయించిన లేడీ ఇన్‌స్పెక్టర్, మండిపడిన పాకిస్తాన్ ఉన్నతాధికారులు, ఉద్యోగం నుంచి తొలగింపు

వారి మధ్య గొడవకు ప్రేమ వ్యవహరమే (rejection of love) కారణమని తెలుస్తోంది. ఇప్పటికే హర్షవర్ధన్‌పై 307, 309, 356ఏ, 354డీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనలో గాయపడిన యువతి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement