Baluchistan, Nov 15: పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అమానుష ఘటన ( Lady police officer forces female detainee) చోటు చేసుకుంది. పోలీస్ రిమాండ్‌లో ఓ ఉన్న మహిళపై లేడీ ఇన్‌స్పెక్టర్ షబానా ఇర్షాద్ అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. ఆమె దుస్తులు విప్పించి జైలులోని ఇతరుల ముందు డ్యాన్స్ (strip and dance naked in front of inmates) చేయించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు మహిళా పోలీసు అధికారి షబానాను ఉద్యోగం నుంచి తొలగించారు. బాధిత మహిళను జైలు కస్టడీకి తరలించారు.
రిమాండులో ఉన్న మహిళ దుస్తులు విప్పించి అందరి ముందు డ్యాన్స్ చేయించిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ సందర్భంగా లేడీ ఇన్‌స్పెక్టర్ షబానా తన విధులను దుర్వినియోగం చేసినట్టు పోలీసు విచారణ కమిటీలో తేలింది. జైలులో రిమాండ్‌లో ఉన్న మహిళపై అమానవీయంగా ప్రవర్తించినట్టు వెల్లడైంది.
క్వెట్టాలోని జిన్నా టౌన్‌షిప్‌లో చిన్నారి హత్య కేసుకు సంబంధించి పారీ గుల్ అనే మహిళను షబానా అరెస్ట్ చేసిందని క్వెట్టాలోని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముహమ్మద్ అజహర్ అక్రమ్ తెలిపారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 400 మంది 6 నెలల పాటు మైనర్ బాలికపై అత్యాచారం, నిందితుల్లో ఒక పోలీసు..
ఆమె పోలీసు రిమాండ్‌లో ఉండగా విచారణ పేరుతో దుస్తులు విప్పించిన ఇన్‌స్పెక్టర్ జైలులోని అందరి ముందు నగ్నంగా డ్యాన్స్ చేయించినట్టు క్వెట్టా ఐజీపీ ముహమ్మద్ అజర్ అక్రమ్ తెలిపారు. మహిళా ఇన్‌స్పెక్టర్ షబానా చెప్పేందుకు ఏమీ లేదని, ఆమెను విధుల నుంచి తప్పించినట్టు చెప్పారు. సాటి మహిళపై ఇలా ప్రవర్తించడం సరికాదని, ఇది సహించరానిదని పేర్కొన్నారు.