Tomato Prices Drop: భారీగా పతనమైన టమోటా ధరలు, ఆందోళన చెందుతున్న రైతన్నలు, ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధర రూ.15

ప్రస్తుతం మార్కెట్లో కిలో అత్యధికంగా రూ.15 వరకు పలుకుతోంది. వారం రోజుల్లో ధరలు సగానికిపైగా తగ్గిపోయాయి. బయట రాష్ట్రాల్లో టమాట దిగుబడి ప్రారంభం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

Tomato . (Photo Credits: Pixabay)

Amaravati, Oct 31: ఏపీ మార్కెట్లో టమాట ధరలు భారీగా (Tomato Prices Drop) పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో అత్యధికంగా రూ.15 వరకు పలుకుతోంది. వారం రోజుల్లో ధరలు సగానికిపైగా తగ్గిపోయాయి. బయట రాష్ట్రాల్లో టమాట దిగుబడి ప్రారంభం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.వారం రోజుల క్రితం కిలో రూ. 36 ఉండేది. ఈసీజన్‌లో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 14వేల ఎకరాల్లో టమాట సాగు చేశారు. పదిహేనురోజుల కిందట 25 కేజీల క్రీట్‌ రూ. 900 నుంచి రూ.750 వరకు ధర పలికింది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో వారం రోజులుగా మార్కెట్లో 15కేజీల టమాటా క్రీట్‌ ధర రూ. 185 కాగా 25కేజీల క్రీట్‌ ధర రూ. 375 వరకు పలుకుతున్నాయి.

ప్రస్తుతం మొదటిరకం టమాటాకిలో రూ.15, రెండోరకం కిలోరూ.8, మూడో రకం రూ.5 వరకు ధరలు పలుకుతున్నాయి. ఇక్కడి నుంచి మార్కాపురం, నరసరావుపేట, విజయవాడ, గుంటూరు, తమిళనాడు, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లకు ఇక్కడి టమాటాలను ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో దిగుబడులు ఊపందుకున్నాయి.

తిరుమలలో బ్లాక్ టికెట్ల దందా, 12 టికెట్లను రూ.32 వేలకు బ్లాక్‌లో శ్రీవారి దర్శనం టికెట్లను విక్రయించిన కాణిపాకం ఆలయ ఉద్యోగిని, కేసు నమోదు చేసిన తిరుమల పోలీసులు

అక్కడి మార్కెట్లో 25కేజీల క్రీట్‌ ధర రూ. 300 వరకు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. దీంతో ఇక్కడి నుంచి ఎగుమతి చేసే టమాట ధరలు పతనం కావడంతో వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో బయట రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపివేశారు. మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గు ముఖం పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.



సంబంధిత వార్తలు

Jogi Ramesh: నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి, జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదని మండిపాటు

Andhra Pradesh: వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

YS Sharmila: మీకు ఓట్లు వేయడమే ప్రజలు చేసిన పాపమా?, కరెంట్ ఛార్జీల పెంపు సరికాదన్న వైఎస్ షర్మిల..మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపు