CM YS Jagan Temple: ఏపీ సీఎం జగన్‌కు గుడి, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, గోపాలపురం మండంలం రాజుపాలెం వైసీపీ నేతల అత్యుత్సాహం

సాధారణంగా దేవుళ్లకు, సినీ తారలకూ కొన్నిచోట్ల ఆలయాలు నిర్మిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏపీ సీఎం వైయస్ జగన్ కు కూడా గుడి (CM YS Jagan Temple) కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో వైసీపీ నేతలు సీఎం జగన్ కు ఆలయం (CM YS Jagan Mohan Reddy Temple) నిర్మిస్తున్నారు. ఈ గుడిలో సీఎం జగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు (MLA Venkatarao Talari) శంకుస్థాపన చేశారు. భూమి పూజ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ సీఎం జగన్ ను ఆకాశానికెత్తేశారు.

YSRCP Leaders in West Godavari District Lay Foundation Stone of CM YS Jagan Mohan Reddy Temple (Photo-Facebook)

Amaravati, August 7: సాధారణంగా దేవుళ్లకు, సినీ తారలకూ కొన్నిచోట్ల ఆలయాలు నిర్మిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఏపీ సీఎం వైయస్ జగన్ కు కూడా గుడి (CM YS Jagan Temple) కడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండంలం రాజుపాలెంలో వైసీపీ నేతలు సీఎం జగన్ కు ఆలయం (CM YS Jagan Mohan Reddy Temple) నిర్మిస్తున్నారు. ఈ గుడిలో సీఎం జగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ ఆలయానికి గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు (MLA Venkatarao Talari) శంకుస్థాపన చేశారు. భూమి పూజ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ సీఎం జగన్ ను ఆకాశానికెత్తేశారు.

దేశంలోనే కరోనా చర్యల్లో ఏపీ అగ్రగామిగా ఉందని కీర్తించారు. ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను ఇతర రాష్ట్రాల నేతలు కొనియాడుతున్నారని వెల్లడించారు. కోవిడ్ అడ్డంకులు సృష్టిస్తున్నా, సీఎం జగన్ వెనుకంజ వేయకుండా కృషి చేస్తున్నారని, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నారని కితాబునిచ్చారు. కాగా, ఈ ఆలయాన్ని స్థానిక వైసీపీ నేత కురుకూరి నాగేశ్వరరావు కుటుంబం నిర్మిస్తోంది. ఈ మేరకు తలారి వెంకట్రావు తన ఫేస్ బుక్ ఖాతాలో ఫోటోలను పోస్ట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 265 మందికి కరోనా, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స, అదే జైలులో రిమాండులో ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, ఈఎస్ఐ స్కాం నిందితులు

Here's MLA Share Tweet

తమిళనాడు వంటి రాష్ట్రాలలో రాజకీయ నాయకులకు గుడికట్టిన సందర్భాలను అనేకం ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితకు గుళ్ళు కట్టి పూజలు చేసిన అభిమానులున్నారు. అయితే ఈ గుడి విషయంపై ఏపీ ప్రభుత్వం కాని సీఎం కాని ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement