Rajahmundry Central Jail: రాజమండ్రి సెంట్రల్ జైల్లో 265 మందికి కరోనా, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స, అదే జైలులో రిమాండులో ఉన్న టీడీపీ నేత కొల్లు రవీంద్ర, ఈఎస్ఐ స్కాం నిందితులు
Rajamahendravaram Central Prison (Photo-Twitter)

Rajahmundry, August 7: రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry central jail) కరోనా కల్లోలం రేపింది. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 247 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల ఒకటో తేదీన 75 మందికి పరీక్షలు చేయగా జైల్‌లో (Rajamahendravaram Central Prison) విధులు నిర్వహిస్తున్న 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు, 2వ తేదీన 64 మందికి పరీక్షలు చేయగా 9 మంది ఖైదీలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సెంట్రల్‌ జైలులో మొత్తం 1,675 మంది ఖైదీలు ఉండగా వారిలో 265 మంది ఖైదీలు కరోనా వైరస్‌ సోకింది. పాజిటివ్‌ వచ్చిన జైల్‌ సిబ్బంది 24 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కాగా ఒకటి, రెండో తేదీల్లో చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన 18 మంది ఖైదీలకు జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. అయితే వీరిలో ఒక ఖైదీ ఆస్పత్రి నుంచి పరారీ కావడంతో మొత్తం ఖైదీలను ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జ్‌ చేయడంతో (8 మంది బెయిల్‌పై విడుదలయ్యారు), మిగిలిన 10 మంది ఖైదీలను రాజ మహేంద్రవరం (Rajamahendravaram) ప్రభుత్వాస్పత్రిలో ఉంచి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్, 3 లేక 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం, సీఎం సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన విద్యా శాఖ మంత్రి సురేష్

ఈ నెల 3వ తేదీన చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 247 మంది ఖైదీలను బయటి ఆస్పత్రికి తరలిస్తే సెక్యూరిటీ సమస్యతో పాటు భారీ స్థాయిలో బెడ్లు ఏర్పాటు చేయవలసి ఉంటుందని దీంతో ఖైదీలను సెంట్రల్‌ జైల్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంట్‌ ఎస్‌.రాజారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 2 లక్షలకు చేరువైన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో 10 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు

ఇదిలా ఉంటే జూలై 6 వతేదీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. జూన్ 13వ తేదీ నుంచి తిరుపతి ఈఐస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్, మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్‌లు రిమాండ్‌లో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిన్న 463 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16వేల696కి చేరింది. కొత్తగా ఏలూరులో 37 భీమవరంలో 51, తాడేపల్లిగూడెంలో 34 కేసులు నమోదు అయ్యాయి. అలాగే జిల్లా కొత్తగా 32 కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తూ... 12 కంటైన్‌మెంట్‌ జోన్లను ఎత్తివేశారు.