AP Colleges Reopen Date: ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్, 3 లేక 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం, సీఎం సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన విద్యా శాఖ మంత్రి సురేష్
AP Educational minister Adimulapu Suresh (Photo-Twitter)

Amaravati, July 6: రాష్ట్రంలోని ఉన్నత విద్య విధానంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan)గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖయమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులు హాజరయ్యారు.

సమావేశం అనంతరం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Suresh) మాట్లాడుతూ.. అక్టోబ‌ర్ 15 నుంచి అన్ని కాలేజీల‌ను (AP Colleges Reopen Date) ప్రారంభిస్తున్నామని అన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు ద‌ఫాలుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోన్న సెట్‌ల‌ను సెప్టెంబ‌ర్ 3వ వారం నుంచి నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. 3, 4 ఏళ్ల డిగ్రీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కళాశాల‌ల్లో నాడు- నేడు కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతామ‌ని తెలిపారు. అన్ని ప్రైవేటు కళాశాల‌లు ఆన్‌లైన్‌లో అడ్మిష‌న్లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ క్ర‌మంలో ఏవైనా కాలేజీలు అక్ర‌మాల‌కు పాల్పడితే వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. రాజధానితో మాకు సంబంధం లేదని తెలిపిన కేంద్రం, రిట్‌ పిటిషన్‌ 20622/2018కు ప్రతిగా ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ

ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ 70 నుంచి 90 శాతం పెంచాల‌ని సూచించారు. క‌ర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ, కడపలో అర్కిటెక్చర్, తెలుగు సంస్కృత అకాడమీ, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ, పాడేరులో గిరిజన విశ్వ‌విద్యాల‌యాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ప్రకాశం జిల్లాలో టీచర్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామ‌ని ఆదిమూల‌పు సురేష్‌ పేర్కొన్నారు.

Here's AP CMO Tweet

అంతకుముందు సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పాడేరులో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకారం. ప్రతి ఏటా కచ్చితమైన నిధుల కేటాయింపుతో.. వచ్చే మూడు నాలుగేళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం తెలిపారు. యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దాదాపు 1110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ప్రభుత్వ కాలేజీలు స్వావలంబన దిశగా సాగాలన్నారు. సెప్టెంబరులో సెట్‌ల నిర్వహణ పూర్తి కావాలని, కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. విశాఖలో తొలి అడుగు పోలీస్ శాఖదేనా? ఆరుగురు అధికారుల ప్ర‌త్యేక బృందంతో ఇప్పటికే క‌మిటీ, 15 రోజుల్లో డీజీపీకి తుది నివేదికను అందిస్తామని తెలిపిన విశాఖ సీపీ రాజీవ్ కుమార్ మీనా

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. దీని వల్ల కచ్చితంగా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పెరగాలన్నారు. పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకు రావాలని, డిగ్రీ కోర్సులో అప్రెంటిస్‌ చేర్చినట్లు తెలిపారు. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ను చేర్చినట్లు పేర్కొన్నారు. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుందని, ఆ తర్వాతే దాన్ని డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తామన్నారు. వృత్తి విద్యా డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్‌ ఉంటుందన్నారు. దీనికి అదనంగా 20 అడిషనల్‌ క్రెడిట్స్‌ సాధించేవారికి కూడా ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వాలని ఆదేశించారు. అడ్మిషన్లు పొందినప్పుడే సాధారణ డిగ్రీ కావాలా? లేదా ఆనర్స్‌ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటామని సీఎం వెల్లడించారు.