Visakhapatnam, August 6: ఏపీ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖ పరిపాలనా రాజధానిగా ఆమోదముద్ర పడిన నేపధ్యంలో పోలీస్ శాఖ ఆవశ్యకత, మౌలిక సదుపాయాల కల్పనపై తమ కమిటీ పరిశీలన చేయనున్నట్లు విశాఖ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా (Rajeev Kumar Meena) అన్నారు. ఆరుగురు అధికారుల ప్రత్యేక బృందంతో కమిటీని నియమించినట్లు తెలిపారు. ఇప్పటికే ఒకసారి సమావేశమైన ఈ బృందం మరో మూడుసార్లు సమావేశమయ్యి తుది నివేదికను 15 రోజుల్లో డీజీపీకి అందిస్తామని సీపీ (Viaskha CP Rajeev Kumar Meena) అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళికలను అందజేశామన్నారు. దీంతో పాటు క్రైం, విఐపిల సెక్యూరిటీ తదితర అంశాలపై కమిటీ పూర్తిగా పరిశీలన జరుపుతుందని వెల్లడించారు.
ఇప్పటికే విశాఖలో (Visakhapatnam) తీసుకోవాల్సిన భద్రతాచర్యలపై సీనియర్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ, మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం ఓఎస్డీ, పోలీసుల శిక్షణా విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్, పర్సనల్ సెల్ ఐజీ, ఇంటెలిజెన్స్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యురో ఐజీ, టెక్నికల్ సెల్ డీఐజీతో హైపవర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఈ నెల 20వ తేదీలోగా తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ), హోం మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డీఐజీకి అందజేయాల్సి ఉంటుంది. రాజధానితో మాకు సంబంధం లేదని తెలిపిన కేంద్రం, రిట్ పిటిషన్ 20622/2018కు ప్రతిగా ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ
మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందక ముందు నుంచే డీజీపీ గౌతం సవాంగ్ (DGP Goutham Sawang) పలుమార్లు విశాఖపట్నంలో పర్యటించారు. పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన భవన సముదాయాల గురించి ఆయన అన్వేషణ కొనసాగించారు. పలు ప్రాంతాలను సందర్శించారు. పలుచోట్ల పర్యటించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వారి నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రుషికొండ, ఆనందపురం, పెందుర్తి సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొట్లకొండ, మధురవాడ ప్రాంతాల్లో గల ఖాళీ స్థలాల గురించి ఆరా తీశారు. ఏపీలో అన్‌లాక్ 3.0 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ ప్రక్రియ, కంటోన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్
తొట్లకొండలోని గ్రేహౌండ్స్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన గోశాల సమీపంలో గల సింహపురి కాలనీని కూడా గౌతం సవాంగ్ సందర్శించారు. ఈ ప్రాంతంలో భూములు ఖాళీగా ఉన్నాయని జీవీఎంసీ అధికారులు ఆయనకు తెలిపారు. పోలీసు కార్యాలయాల నిర్మాణానికి అనువైనవా? కాదా? అనే విషయంపై డీజీపీ ఆరా తీసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆనందపురం మండలంలో గ్రేహౌండ్స్ విభాగానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్నీ డీజీపీ పరిశీలించారు. రాష్ట్ర పోలీసుల ప్రధాన కార్యాలయాన్ని ఆనందపురంలో నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది.కాగా రిట్ పిటిషన్ 20622/2018కు ప్రతిగా కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది.