AP Assembly Session 2023: నేను అసెంబ్లీలో మీసం మెలేయలేదు, తొడ కొట్టి మీసం మెలేసింది వైసీపీ వాళ్లే, కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పిన బాలయ్య

అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని ఆయన గుర్తుచేశారు.

Balakrishna (Photo-Video Grab)

Vjy, Sep 21: అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని ఆయన గుర్తుచేశారు. సభలో తనకు మాత్రమే అవమానం జరగలేదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమని అధికార పార్టీ నేతలు కించపరిచారని ఆరోపించారు. శాసనసభలో సస్పెండ్ అనంతరం మల్కాపురం గ్రామంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని, దీనిపై పోరాటం ఆపేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మీసం మెలేసి, తొడ కొట్టిందీ వైసీపీ ఎమ్మెల్యేలేనన్న ఆయన.. తాను చేయని పనిని చేసినట్లు అసత్యాలు సృష్టించారన్నారు. స్పీకర్ చేతా అబద్ధాలు చెప్పించారని దుయ్యబట్టారు. మంద బలంతో విర్రవీగుతున్న వైకాపా ఎమ్మెల్యేలకు తగిన మూల్యం తప్పదన్నారు. ప్రజలే వారికి త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చ, టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, లైవ్ అప్ డేట్స్ ఇవిగో..

అసెంబ్లీలో న్యాయం అడిగినందుకు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని.. స్పీకర్ హోదాలో నన్ను హెచ్చరిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని విమర్శించారని మండిపడ్డారు.న్యాయం కోసం పోరాడుతున్నాం.చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేశారు.చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ పై చర్చించాలని స్పీకర్‌ను అభ్యర్థించాము.మేం కేసులకు భయపడేది లేదన్నారు.

Here's Video

చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకొని.. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదే నినాదంతో అసెంబ్లీకి వెళ్లామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీకి ఒక దుర్దినమన్న అచ్చెన్న.. 200 మంది మార్షల్స్‌ను పెట్టి సభ జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. స్పీకర్ తీరు చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. మంత్రి నేరుగా మీసం మెలేసి బూతులు తిట్టినా ఎలాంటి చర్యలు లేవని దుయ్యబట్టారు.

అసెంబ్లీలో మీసం తిప్పినందుకు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, అసెంబ్లీ సెషన్ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

ములాఖాత్‌, మిలాఖాత్‌లతోనే పుట్టిన పార్టీ వైసీపీ అని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ఢిల్లీకి సీఎం వెళ్లి ఎవరితో ములాఖాత్‌, మిలాఖాత్ అవుతున్నారని ప్రశ్నించారు. దశాబ్ద కాలంగా జగన్ ఆస్తుల కేసు ప్రస్తావన రాకపోవడానికి ఏ ములాఖాత్, మిలాఖాత్‌ కారణమని నిలదీశారు. స్కిల్ కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు. 144 సెక్షన్, 30ఏ చట్టాలను అసెంబ్లీలోనూ సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని తెదేపా శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలు తెలియాలంటే.. తమ పవర్ పాయింట్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Advertisement
Advertisement
Share Now
Advertisement