ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు. బాటిళ్లు విసురుతూ అనుచితంగా ప్రవర్తించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. అంబటి వైపు చూస్తూ తొడగొట్టి.. మీసాలు మెలేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారు.

టీడీపీ సభ్యులు అవాంఛనీయ ఘటనలను ఆహ్వనిస్తున్నారు. స్పీకర్‌పై దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.అసెంబ్లీలో మీసం తిప్పినందుకు బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని సీతారాం వార్నింగ్ ఇచ్చారు.ఏపీ అసెంబ్లీ నుండి 14 మంది టీడీపీ సభ్యులని ఒక్కరోజు, ముగ్గురిని ఈ సెషన్ మొత్తం స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

Speaker Tammineni Sitaram warned Balakrishna for twirling his mustache in the assembly

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)