AP DY CM Pawan Kalyan: పిఠాపురం మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిఫ్ట్, ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మీ వ్రత పూజ, 12 వేల చీరలు పంపిణీ చేయనున్న జనసేనాని

ఓ వైపు పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్...తాజాగా తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురం మహిళలకు శ్రావణమాసం గిఫ్ట్‌ను అందించనున్నారు. ఈ నెల 30న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉచిత వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం, వరలక్ష్మీ వ్రతం చేసుకునే ఆడపడుచులకు 12 వేల చీరలు పంపిణి చేయనున్నారు.

AP Dy CM Pawan Kalyan to distributes 12 thousand sarees for Varalakshmi Vratam

Vij, Aug 29: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. ఓ వైపు పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్...తాజాగా తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురం మహిళలకు శ్రావణమాసం గిఫ్ట్‌ను అందించనున్నారు. ఈ నెల 30న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉచిత వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం, వరలక్ష్మీ వ్రతం చేసుకునే ఆడపడుచులకు 12 వేల చీరలు పంపిణి చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. ఆలయ సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం తరలి వచ్చే మాతృమూర్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయమని ఈవో భవాని ఆలయ అధికారులకు తెలిపారు.

ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపడుచులు అందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమ చీర ప్రసాదంగా అందజేయమని స్థానిక ఎమ్మెల్యే ఉపముఖ్యమంత్రి పవన్ తన సొంత నిధులతో వాటిని సమకూర్చారని హరిప్రసాద్ తెలిపారు. 6000 మందికి ఆలయం వద్ద వ్రతం అనంతరం చీరలు పంపిణీ చేయనుండగా మిగతా 6000 మందికి మందికి అమ్మవారి నివేదన అనంతరం చేబ్రోలు పార్టీ కార్యాలయంలో చీరలను అందజేయనున్నారు.

Here's Video:

 పెద్ద ఎత్తున మహిళలు తరలిరానున్న నేపథ్యంలో క్యూలైన్లు పూజా సామాగ్రి పంపిణీ వంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు ఈవో భవాని. ప్రతి సంవత్సరం లా కాకుండా ఈసారి పూజా కార్యక్రమం నిర్వహించడానికి మరింత ప్రదేశాన్ని కేటాయించామని ఆలయ అధికారులు హరిప్రసాద్ కి తెలిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మూడు బ్యాచ్లుగా ఈ వ్రతం నిర్వహించి ఇబ్బందులు కలగకుండా చూడాలని హరిప్రసాద్ అధికారులకు సూచించారు.