Corona in AP: మాస్క్ లేకుండా ఉద్యోగానికి వెళితే కంపెనీలకు రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లోకి

కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్‌లు (Masks) లేని వారిని అనుమతిస్తే రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా (impose a fine of Rs 10,000 to Rs 25,000) విధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Representational Image | (Photo Credits: IANS)

Amaravati, July 31: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా నిబంధనల్ని మరింత కఠినతరం చెయ్యాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరిక జారీ చేసింది. కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లోకి మాస్క్‌లు (Masks) లేని వారిని అనుమతిస్తే రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా (impose a fine of Rs 10,000 to Rs 25,000) విధిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

జరిమానా మొత్తాన్ని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఖరారు చేస్తామని, అదే విధంగా 2-3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ (Coronavirus) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి తమకు ఆ ఫొటోలు పంపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనికోసం ప్రత్యేకంగా 8010968295 వాట్సప్ నెంబర్‌ను కేటాయించామని ఆయన వెల్లడించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు వారాల పాటు రాత్రి వేళ కర్ఫ్యూను పొడిగించినట్లు తెలిపారు.

ఏపీలో 22 వేల దిగువకు వచ్చిన కరోనా యాక్టివ్‌ కేసులు, తాజాగా 2,058 కేసులు నమోదు, 24 గంటల్లో 2,053 మంది కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 21,180 యాక్టివ్‌ కేసులు, కోవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లలకు ఏపీ ప్రభుత్వం చేయూత

ఆగస్టు 14 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అమలులో వుంటాయన్నారు. అందరూ కోవిడ్ ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. మాస్క్ లు ధరించని వారికి రూ.100 జరిమానా విధించే అధికారాన్ని ఎస్ఐ ఆపై పోలీసు అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ ఈ అధికారం వైద్యాధికారులకు మాత్రమే ఉండేదని పేర్కొన్నారు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement