Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

Amaravati, July 31: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 78,992 పరీక్షలు నిర్వహించగా.. 2,058 కేసులు నిర్ధారణ (Corona in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,66,175 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 23 మంది బాధితులు (23 deaths) ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,377కి చేరింది.

24 గంటల వ్యవధిలో 2,053 మంది బాధితులు (2,053 recoveries) కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,31,618కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,180 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,45,63,043 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మృతి చెందటంతో అనాథలుగా మిగిలిన పిల్లల భవిష్యత్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించి కొండంత అండగా నిలుస్తోందని వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు అన్నారు. జిల్లాలో కరోనా వల్ల తల్లిదండ్రులు మృతి చెందగా.. అనాథలైన మూడు కుటుంబాల్లోని నలుగురు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసిందని ఆయన తెలిపారు.ఆ మొత్తాలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన బాండ్లను సంబంధిత చిన్నారులకు కలెక్టర్‌ తన చాంబర్‌లో శుక్రవారం అందజేశారు.

అగ్ని కీలల్లో 6 గురు ఒడిశా కూలీలు సజీవ దహనం, మావనతా దృక్పథంతో స్పందించిన ఏపీ సీఎం వైయస్ జగన్, మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలు

బాండ్లను అందుకున్న వారిలో అట్లూరు మండలం ముతుకూరుకు చెందిన అరవ రామిరెడ్డి, రమాదేవి పిల్లలు మని (14), వెంకట శ్రీనాథ్‌రెడ్డి (16), ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లెకు చెందిన షేక్‌ సయ్యద్, మహబూబ్‌బీ కుమార్తె కమాల్‌బీ (16), బి.మఠం మండలం సోమిరెడ్డిపల్లెకు చెందిన జి.ప్రకాశం, ఫాతిమా దంపతుల కుమార్తె గొల్లపల్లె భవాని (17) ఉన్నారు.

టీడీపీతో పెట్టుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారు, దేవినేని ఉమపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గం, మీడియాతో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కోవిడ్‌ కారణంతో తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేదా ఇద్దరూ మరణిస్తే.. 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తోందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్‌ బీమా, ఇతర బీమాలతో సంబంధం లేకుండా ఈ మొత్తం అందుతుందని తెలిపారు. సహాయం అందుకున్న వారంతా బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి మంచి పేరు తెచ్చుకోవాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు.