New Delhi, April 30: భారత్‌లో కరోనా(Corona) తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రోజువారీ కేసులు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో (Delhi) పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ప్రతిరోజు నమోదవుతున్న కేసుల్లో (Daily cases) సగానికిపైగా అక్కడి నుంచే వస్తున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకు పైగానే నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 3688 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,75,864కు చేరాయి. ఇందులో 4,25,33,377 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,23,803 మంది మృతిచెందారు. ఇంకా 18,684 కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో 1607 కేసులు ఢిల్లీలోనే ఉన్నాయి.
COVID19 | 3,688 new cases in India today; Active caseload rises to 18,684 pic.twitter.com/9NB1foJONC
— ANI (@ANI) April 30, 2022
గత 24 గంటల్లో 2755 మంది కోలుకోగా, 50 మంది మృతిచెందారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతానికి పెరిందని చెప్పింది. 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 1,88,89,90,935 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని, ఇందులో నిన్న ఒక్కరోజే 22,58,059 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది.
ఇక ఢిల్లీలో కొత్త సబ్ వేరియంట్‌కు సంబంధించిన కేసులు నమోదవ్వడంతో ఆరోగ్యశాఖ అధికారులు అలర్టయ్యారు. ఆయా వ్యక్తులకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్టులను ట్రేస్ చేశారు. వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. అటు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.