దేశంలో తాజాగా 3,377 కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,72,176కు చేరాయి. ఇందులో 4,25,30,622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 5,23,753 మంది మృతిచెందగా, 17,801 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2496 మంది కరోనా నుంచి కోలుకోగా, 60 మంది మరణించారు. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం ఢిల్లోనే ఉన్నాయి. దేశరాజధానిలో నిన్న ఒక్కరోజే 1490 కరోనా కేసులు రికార్డయ్యాయి.
కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.71 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉన్నాయని, 98.74 శాతం మంది డిశ్చార్జీ అయ్యారని, 1.22 శాతం మంది మరణించారని తెలిపింది. ఇప్పటివరకు 1,88,65,46,894 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో గురువారం ఒక్కరోజే 22,80,743 మందికి వ్యాక్సినేషన్ చేశామని ప్రకటించింది.
COVID-19 | India reports 3,377 fresh cases, 2,496 recoveries and 60 deaths in the last 24 hours. Active cases 17,801 pic.twitter.com/wkaLxHxjPn
— ANI (@ANI) April 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)