దేవినేని ఉమపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసీపీ నాయకులే దాడి చేసి రివర్స్‌ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. విజయవాడలోని గొల్లపూడిలో దేవినేని కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అక్రమ మైనింగ్‌ జరగకపోతే నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారు? పోలీసులు దారి మళ్లించి దాడి జరిగే ప్రాంతం వైపు ఉమను వెళ్లేలా చేశారు. ఈ దాడులకు టీడీపీ భయపడదు. టీడీపీతో పెట్టుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారు’ అని చంద్రబాబు అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)