Input Subsidy to Farmers: మిచాంగ్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల, 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,294.58 కోట్ల పరిహారం జమ చేసిన సీఎం జగన్

గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(crop loss compensation)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

AP government Released crop loss compensation to farmers whose crops were damaged by Cyclone Michaung (Photo-AP CMO)

గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(crop loss compensation)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు.వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్‌ ఆరంభంలో 2023 డిసెంబర్లో తుఫాను కల్లోలం రేపిన సంగతి విదితమే. వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్, దశాబ్దాల కల సాకారం అయినందుకు గర్వంగా ఉందని వెల్లడి

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్‌ వర్షాభావం వల్ల, మిచాంగ్‌ తుపాను (Cyclone Michaung) వల్ల నష్టపోయిన రైతులకు సీజన్‌ మగిసేలోగా రైతన్నలకు తోడుగా, అండగా ప్రభుత్వం (AP government) ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా, పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటి సారిగా పరిస్థితులు మార్చాం. గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.



సంబంధిత వార్తలు

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Union Budget 2025-26: వేత‌న‌జీవుల‌కు త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్, రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చే యోచ‌న‌లో కేంద్రం, ఈ బడ్జెట్ లో బొనాంజా ప్ర‌కటించే ఛాన్స్

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

K Annamalai on Sandhya Theatre Incident: తెలంగాణ‌లో అన్నీ వదిలేసి సినిమావాళ్ల వెంట‌ప‌డుతున్నారు! సీఎం రేవంత్ రెడ్డిపై త‌మిళ‌నాడు బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు