AP Inter Results: రేపే ఏపీ ఇంటర్ 1st, 2nd Year ఫలితాలు విడుదల, ఆన్ లైన్ లో రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు లింక్ ఇదే
ఫలితాలు మధ్యాహ్నం 12:30కి ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా ప్రకటించబడతాయి. ప్రకటన వెలువడిన వెంటనే, విద్యార్థులు ఆన్‌లైన్‌లో bie.ap.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ స్కోర్‌లను చెక్ చేసుకోవచ్చు.
AP Inter Results: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE), AP 1st, 2nd Year ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు, జూన్ 22న ప్రకటిస్తుంది. ఫలితాలు మధ్యాహ్నం 12:30కి ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా ప్రకటించబడతాయి. ప్రకటన వెలువడిన వెంటనే, విద్యార్థులు ఆన్‌లైన్‌లో bie.ap.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ స్కోర్‌లను చెక్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో మార్కులను తనిఖీ చేయడానికి, విద్యార్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ హాల్ టిక్కెట్ నెంబర్ పూరించాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు AP ఇంటర్ ఫలితాలపై తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. మార్కులను తనిఖీ చేయడానికి, AP ఇంటర్ హాల్ టిక్కెట్‌పై పేర్కొన్న విధంగా విద్యార్థులకు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీ అవసరం. ఫలితాలు ప్రకటించిన వెంటనే పైన పేర్కొన్న వెబ్ సైట్లలో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
బీఐఈఏపీ చైర్‌పర్సన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. IPE 2022 సాధారణ, వృత్తి విద్యా కోర్సుల ఫలితాలు రేపు ప్రకటించనున్నారు. ఫలితాలు పరీక్ష ఫలితాల examresults.ap.nic.in. విజయవాడలో ప్రకటన వెలువడనుంది.