AP Coronavirus: చిత్తూరులో పెరుగుతున్న కరోనా తీవ్రత, ఏపీలో తాజాగా 3,263 మందికి కోవిడ్ పాజిటివ్, 11 మంది మృతితో 7,311కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

పీలో గడచిన 24 గంటల్లో ఏపీలో 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,263 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నమోదైంది. చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తాజాగా 654 కొత్త కేసులు (Covid in AP) వెల్లడయ్యాయి.

Coronavirus Outbreak in India | Photo: IANS

Amaravati, April 12: ఏపీలో గడచిన 24 గంటల్లో ఏపీలో 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,263 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని నమోదైంది. చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తాజాగా 654 కొత్త కేసులు (Covid in AP) వెల్లడయ్యాయి.

విశాఖ జిల్లాలో 454, గుంటూరు జిల్లాలో 418, కృష్ణా జిల్లాలో 318 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,091 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. 11 మంది మృత్యువాత పడ్డారు.

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మరణించగా, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపూర్, వైఎస్సార్ కడప, కర్నూల్, విశాఖ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,28,664 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,98,238 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 7,311 మంది కన్నుమూశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,115 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు అనుమతి, టీకాను ఉత్పత్తి చేసి విక్రయించనున్న డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీ, అత్యవసర వినియోగానికి సిఫార్సు చేసిన కేంద్ర నిపుణుల కమిటీ

దేశంలో నిన్న కొత్త‌గా 1,68,912 మందికి కరోనా నిర్ధారణ అయింది. వాటి ప్రకారం... నిన్న‌ 75,086 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,35,27,717కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 904 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,70,179కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,21,56,529 మంది కోలుకున్నారు. 12,01,009 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 10,45,28,565 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement