Sputnik V vaccine | (Photo Credits: Yalç?n Sonat / 123rf)

New Delhi, April 12: భారత్ లో మరో వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతి లభించింది. దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన కొరత ఏర్పడిన నేపథ్యంలో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ (Sputnik V Covid Vaccine) అత్యవసర వినియోగం కోసం కేంద్ర నిపుణుల కమిటి కేంద్రానికి సిఫారసు చేసింది. దీంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్ (Sputnik V, Russian COVID-19 Vaccine) ఉత్పత్తి చేసి వినియోగం లోకి తీసుకురానున్నారు.

డీజీసీఐ అనుమతి లభిస్తే దేశంలో సీరం, ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా కొవిషీల్డ్ లతొ పాటుగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవ్యాగ్జిన్ తరువాత రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఆమోదం లభించనుంది. దేశంలో ఇది అనుమతి లభించిన మూడో వ్యాక్సిన్ గా నిలవనుంది. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎప్ అభివృద్ధి చేసిన ఈ టీకాను ఇండియాలో ఉత్పత్తి చేసి విక్రయించేందుకు డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.

మేడ్ ఇన్ చైనా వ్యాక్సిన్, చైనా తయారు చేసిన వ్యాక్సిన్లకు సామర్థ్యం చాలా తక్కువ, ర‌క్ష‌ణ క‌ల్పించే శ‌క్తి లేదు, సంచలన విషయాలను వెల్లడించిన ఆ దేశ ప్రభుత్వ ఉన్నతాధికారి

స్పుత్నిక్ వి టీకాపై మన దేశంలో రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను ఇటీవలే ఆ సంస్థ నిర్వహించింది. ఆ పరీక్షల భద్రత ఇమ్యునోజెనివిటి సమాచారాన్ని ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలికి డాక్టర్ రెడ్డీస్ అందజేసింది. టీకా ఉత్పత్తి, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకుంది. సోమవారం ఈ డేటాను కేంద్ర నిపుణులు కమిటీ విశ్లేషించి అత్యవసర వినియోగానికి సిఫార్సు చేసింది.

దేశంలో కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో రెమ్‌డెసివిర్ ఔషధం, ఇంజెక్షన్ ఎగుమతిపై నిషేధం విధించారు. ఈ మేర‌కు భారత ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.కరోనా వైరస్ కేసులకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీ-వైరల్ ఔషధం లేదా ఇంజెక్షన్ కొరతను అనేక రాష్ట్రాలు నివేదించిన నేప‌థ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న‌ది. “కొవిడ్‌ కేసుల ఇటీవ‌ల‌ భారతదేశం అంత‌టా పెరుగుతున్నాయి. 2021 ఏప్రిల్ 11 నాటికి 11.08 లక్షల పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి.

కరోనా సెకండ్ వేవ్..డేంజర్ జోన్‌లో ఇండియా, బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసి రెండవ స్థానంలోకి, దేశంలో 1.35 కోట్లకు చేరుకున్న మొత్తం కేసులు సంఖ్య, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌ ఎగుమతిపై నిషేధం

ఇవి క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ రెమ్‌డెసివిర్ కోసం డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. రాబోయే రోజుల్లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కోసం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్న‌ది ” అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని పెంచడానికి ఫార్మాస్యూటికల్స్ విభాగం దేశీయ తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

రెమ్‌డెసివిర్ అన్ని దేశీయ తయారీదారులు తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని, వారి స్టాకిస్టులు / పంపిణీదారుల వివరాలను ఔషధాలు ల‌భించ‌డాన్ని సులభతరం చేయడానికి దాని తాజా క్రమంలో సూచించారు. “డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు స్టాక్‌ల‌ను ధృవీకరించడానికి, హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు” అని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కాగా కొవిడ్‌-19 కు వ్యతిరేకంగా పోరాటంలో ముఖ్యంగా తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వయోజన రోగుల్లో రెమ్‌డెసివిర్ ఒక ముఖ్యమైన యాంటీ-వైరల్ ఔషధంగా పరిగణించబడుతున్న‌ది.

అమెరికాకు చెందిన మెస్స‌ర్స్ గిలియ‌డ్ సైన్సెస్‌లై సంస్థ‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏడు భారతీయ కంపెనీలు ఇంజెక్షన్ రెమ్‌డెసివిర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. గిలియడ్ సైన్సెస్‌కు నెల‌కు దాదాపు 38.80 లక్షల యూనిట్ల సామర్థ్యం ఉంది. ఈ విష‌యాన్ని అన్ని ఆస్పత్రులకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో తెలియజేయాలని, అలాగే పర్యవేక్షించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్రం సూచించింది.