AP SSC 10th Result Postponed: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వాయిదా, సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు వెల్లడి, సోమవారం విడుదల చేస్తామని ప్రకటన..

సాంకేతికపరమైన ఇబ్బందుల తలెత్తడం వల్లనే పదో పరీక్ష ఫలితాలు వాయిదా వేసినట్లు తెలిపారు.

Representational Image (Photo Credits: PTI)

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈరోజు విడుదల కావాల్సిన ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. తొలుత శనివారం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ పదో తరగతి ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. ఈ మేరకు విద్యాశాఖ వెల్లడించింది.

సాంకేతిక కారణాలతో....

కొన్ని అనివార్య కారణాల వల్ల పదో తరగతి ఫలితాలను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతికపరమైన ఇబ్బందుల తలెత్తడం వల్లనే పదో పరీక్ష ఫలితాలు వాయిదా వేసినట్లు తెలిపారు. అందుకే చివరి నిమిషంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు.

What Is Elinati Shani Effect: ఏలినాటి శని అంటే ఏంటో తెలుసా, శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, ఈ తప్పు చేస్తే ఏడున్నరేళ్లు శని వదలకుండా పట్టి పీడిస్తుంది..

పదో తరగతి పరీక్ష ఫలితాల వాయిదాపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డ ముఖ్యమంత్రి పదో తరగతి పరీక్ష ఫలితాలను వాయిదా వేయడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. చివరి నిమిషంలో ఫలితాల విడుదలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి, మంత్రి విద్యార్థులకు సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు నిలదీశారు.

చేతకాని పాలనతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తికి విద్యాశాఖను అప్పగించారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లాలో ఉన్న మద్యం షాపుల సంఖ్య తప్ప రాష్ట్రంలోని పాఠశాలల సంఖ్య మంత్రి బొత్స సత్యనారాయణకు తెలుసా? అని అచ్చెన్న నిలదీశారు. జగన్ రెడ్డి పాలనలో పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దిగజారాయని ఆయన మండిపడ్డారు. నాడు నేడు పేరుతో కమీషన్ల పేరుతో నిధులను దండుకున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.