AP Weather Alert: ఏపీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన ద్రోణితో పాటు ఈశాన్య రుతుపవనాల ప్రారంభ ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మళ్లీ పుంజుకోనున్నాయి.

Andhra Pradesh Heavy rains for another 3 days

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన ద్రోణితో పాటు ఈశాన్య రుతుపవనాల ప్రారంభ ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మళ్లీ పుంజుకోనున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరికలు జారీ చేసింది.

విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించిన వాతావరణ వివరాల ప్రకారం.. కోస్తాంధ్ర , రాయలసీమ జిల్లాలలో ఈ ద్రోణి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు , చిత్తూరు జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది.  భారత్‌లో చలికాలంపై WMO కీలక హెచ్చరిక.. ఈ రోగాలు రాకుండా జాగ్రత్తపడాలని సూచన.. రికార్డు స్థాయికి ఎల్‌నినో దూసుకుపోతుండమే కారణం..

ఈ వర్షాలు, పిడుగుపాటు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కురుస్తున్న సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా భారీ హోర్డింగుల కింద తలదాచుకోవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, కూలీలు , పశువుల కాపరులు పిడుగుల ప్రమాదం పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం ప్రారంభం కాగానే సురక్షితమైన పక్కా భవనాల్లోకి వెళ్లాలని ఏపీఎస్డీఎంఏ అధికారులు సూచించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement