MP Vijaya Sai Reddy: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్‌గా ఎంపీ విజయసాయి రెడ్డి నియామకం, బాలినేని స్థానంలో విజయసాయిరెడ్డికి చాన్స్, మూడు జిల్లాల్లో సమస్యలకు చెక్ పెట్టే దిశగా సీఎం జగన్ పావులు..

గతంలో ఈ పోస్టుకు బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ్యులుగా ఉన్నారు. అయితే తాజాగా బాలినేని పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయగా,మూడు జిల్లాల కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

Vijayasai reddy (Photo-Twitter)

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పచెప్పారు. గతంలో ఈ పోస్టుకు బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ్యులుగా ఉన్నారు. అయితే తాజాగా బాలినేని పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయగా,మూడు జిల్లాల కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాగా ఆ స్థానంలో ఇప్పుడు విజయసాయిరెడ్డిని నియమించడం పార్టీలో జిల్లాల్లో చర్చకు దారి తీసింది. ఒంగోలు జిల్లాలో కీలక వ్యక్తి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానంలో విజయసాయి రెడ్డి బాధ్యతలు తీసుకుంటే అది పెద్ద సవాలే అవుతుందని, సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరోవైపు చాలా కాలంగా విజయసాయిరెడ్డి సైతం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఢిల్లీ కే పరిమితం అయ్యారు. గతంలో ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలకు బాధ్యులుగా ఉన్నారు. కానీ ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాలకు బాద్యులుగా నియమించారు.

మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీకి పరిమితం అయిన విజయసాయిరెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్‌, విజయసాయిరెడ్డి మధ్య సఖ్యత లేదని, వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి చెక్ పెడుతూ సీఎం జగన్ ఆయనకు మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉంది. ఈ మూడు జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇప్పటికే ఉమ్మడి ఒంగోలు జిల్లాలో బాలినేని, వైవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య చోటు చేసుకున్న వైరం పార్టీని నష్ట పరిచేలా మారింది. దానికి తోడు ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తిరుగు బావుటా ఎగరేశారు. అటు చిత్తూరు జిల్లాలో కూడా మంత్రి పెద్ది రెడ్డి పెత్తనంపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి లాంటి వారు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,

ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా విజయసాయిరెడ్డి కృషి చేస్తారని, వైసీపీ అంతర్గత సమాచారం. గత కొంతకాలంగా వెలుగులోకి రాని విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్‌గా మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఈ మూడు జిల్లాలో ముదురుతున్న వివాదాలు, అసంతృప్తిని చల్లార్చి ముందుకు సాగేందుకు విజయసాయిరెడ్డి అయితే కరెక్ట్ పర్సన్ అని సీఎం జగన్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే విజయసాయి రెడ్డి తనకు లభించిన పదవిపై ఇంకా సోషల్ మీడియాలో పార్టీకి కృతజ్ఞతలు చెప్పకపోవడం కొసమెరుపు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు