Badvel By Election Results 2021: బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం, డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్, బీజేపీ

10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ 85,505 ఓట్ల ఆధిక్యం సాధించింది.

YSRCP Flag (Photo-File image)

బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. 10 రౌండ్లు ముగిసేసరికి వైఎస్సార్‌సీపీ 85,505 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు అన్ని రౌండ్లలో కలిపి వైఎస్సార్‌సీపీ 1,06,088 ఓట్లు సాధించగా.. బీజేపీ 20,583, కాంగ్రెస్‌ 5968 ఓట్లు సాధించింది. అధికారికంగా మరో రౌండ్‌ ఫలితం వెలువడాల్సి వుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అలాగే, లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాజంపేట సబ్‌కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌ గార్గ్‌ మీడియాకు తెలిపారు. తెలంగాణలోని హూజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం కూడా మంగళవారం వెలువడనుంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా మరో 27 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకూ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందులో దాద్రానగర్‌ హవేలీ, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్‌ 30న ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే.