IPL Auction 2025 Live

Theft inTTD Parakamani: తిరుపతి హుండీ నుంచి రూ. 94 వేలు చోరీ, మాస్క్‌లో పెట్టుకొని బయటకు వెళ్లేందుకు ఉద్యోగియత్నం, గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది, ఇది మొదటిసారి కాదు! గతంలోనూ చిల్లర పనులకు పాల్పడ్డట్లు గుర్తింపు

వెంటనే మాస్క్ (Mask) తీయాలని ఆదేశించగా దిలీప్ దొంగతనం బయటపడింది. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్న దిలీప్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దిలీప్ ఇటువంటి చిల్లర పనులు చేయటం మొదటిసారికాదు. గతంలో కూడా దిలీప్ చేసిన చోరీలు బయటపడ్డాయి.

Tirumala Tirupati Devasthanams | Photo: Twitter

Tirupati, OCT 26: తిరుమల పరకామణిలో (parakamani) బ్యాంక్ ఉద్యోగి చేతివాటం బయటపడింది. శ్రీవారి హుండీ (Tirupati Hundi) కానుకలను లెక్కించే పరకామణిలో ఓ బ్యాంకు ఉద్యోగి చోరీకి యత్నించి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. శ్రీవారి కానుకలను లెక్కించే పరకామణిలో (parakamani) ఓ బ్యాంక్ ఉద్యోగి రూ.94వేలు దాచేశాడు. రెండు వేల రూపాయల నోట్లను మాస్క్ లో దాచేసి ఎస్కేప్ అవుతుండగా విజిలెన్స్ అధికారులు (vigilance officials) గుర్తించటంతో అడ్డంగా దొరికిపోయాడు. దిలీప్ అనే బ్యాంక్ ఉద్యోగి పరకామణిలో నుంచి రూ.94వేలు చోరీ చేసాడు. ఎవ్వరు తనను పట్టుకోరనే ధైర్యమో లేక అక్కడి డబ్బు చూసి దురాశ పుట్టిందో గానీ తానో ఉద్యోగి అనే విషయం కూడా మర్చిపోయి సాక్షాత్తూ దేవుడి సొమ్మునే కొట్టేద్దామనుకుని అడ్డంగా దొరికిపోయాడు.

Weather Forecast: సిత్రాంగ్ తుపాన్ విధ్వంసంలోనే మరో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, అక్టోబరు 29 నాటికి శ్రీలంక,తమిళనాడు మధ్యన ఏర్పడనుందని అంచనా 

కానుకల లెక్కింపు తరువాత రూ.94 రెండువేల రూపాయల నోట్లను మాస్క్ లో పెట్టుకుని బయటకు వస్తుండగా విజిలెన్స్ అధికారులు అనుమానించారు. వెంటనే మాస్క్ (Mask) తీయాలని ఆదేశించగా దిలీప్ దొంగతనం బయటపడింది. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్న దిలీప్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దిలీప్ ఇటువంటి చిల్లర పనులు చేయటం మొదటిసారికాదు. గతంలో కూడా దిలీప్ చేసిన చోరీలు బయటపడ్డాయి.

Andhra Pradesh Fire: పాలకొండలో బైక్ షోరూంలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్లో పూర్తిగా కాలిపోయిన 36 ఈ-బైకులు, యాభై లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం 

అయినా ఎవ్వరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో బరితెగించి శ్రీవారి కానుకలనే కొట్టేయటానికి సిద్ధపడ్డాడు. ఏడాది నుంచి కాంట్రాక్టు ఉద్యోగిగా కొనసాగుతున్న దిలీప్ లడ్డూల కౌంటర్ లో కూడా అక్రమాలకు పాల్పడ్డాడు. కానీ ఎందుకు అతినిపై చర్యలు తీసుకోకపోవటంతో తాజాగా పరకామణిలో కానుకలు లెక్కించి రూ.94వేలు చోరీ చేసి అధికారులకు దొరికిపోయాడు.