Fire Accident in Bus: నర్సింగ్ కళాశాల విద్యార్ధులకు తప్పిన పెను ప్రమాదం.. కళాశాల బస్సు దగ్ధం.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ఘటన (వీడియో)

ఏపీలోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై బస్సులో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తృటిలో తప్పించుకున్నారు.

Fire Accident in Bus (Credits: X)

Bapatla, Nov 30: ఏపీలోని (AP) బాపట్ల (Bapatla) జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద జాతీయ రహదారిపై బస్సులో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన నుంచి నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తృటిలో తప్పించుకున్నారు. పరీక్షలు రాసేందుకు కళాశాల బస్సులో నర్సింగ్ విద్యార్ధినులు వెళుతున్న సమయంలో ఈ  బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బస్సు రేపల్లె ఐఆర్ఈఎఫ్ విద్యా సంస్థకు చెందినదిగా తెలుస్తుంది. విద్యుదఘాతంతో బస్సు నుంచి మంటలు చెలరేగినట్టు సమాచారం.

సాంబార్‌ లో కప్ప.. భోజనం మానేసిన విద్యార్థినులు.. నాగార్జున యూనివర్సిటీలో ధర్నా.. స్పందించిన మంత్రి నారా లోకేష్ (వీడియో)

Here's Video:

విద్యార్థినులు గమనించడంతో..

అయితే, ముందుగానే పొగను గుర్తించి విద్యార్థినులు బస్సు నుంచి దిగిపోయారు. దీంతో పెనుప్రమాదం తప్పింది.  30 మంది విద్యార్థినులు దిగిపోయిన కొద్దిసేపటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు స్పందించి నీళ్లు చల్లినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. రేపల్లె అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు.

దూసుకువస్తున్న ఫెంగల్ తుఫాన్.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement