Chandra Babu Naidu: హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో చంద్రబాబుకు పరీక్షలు..మంగళవారం సర్జరీ చేసే అవకాశం..

ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు దాదాపు గంట పాటు వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

chandrababu (Photo-PTI)

చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని, మంగళవారం ఆపరేషన్ చేసే  అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించారు. ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు దాదాపు గంట పాటు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మంగళవారం నాడు సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.  చంద్రబాబు నాయుడు ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో రెండు రోజుల పాటు వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జూన్‌లో ఎడమకంటికి శస్త్ర చికిత్స జరగగా, నేడు ఎల్‌వి ప్రసాద్‌ ఆసుపత్రిలో కుడికంటికి శస్త్ర చికిత్స జరిగే అవకాశం ఉంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోగ్య కారణాలతో మాజీ ముఖ్యమంత్రి అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. పార్టీ క్యాడర్, అనుచరులు, అభిమానుల అపూర్వ స్వాగతం మధ్య టీడీపీ జాతీయ అధ్యక్షుడు నవంబర్ 1న హైదరాబాద్ చేరుకున్నారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది